రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

RRB Recruitment 2024 నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

RRB Technician age limit? RRB Technician Eligibility in telugu?RRB Technician post details?Rrb technician recruitment 2024 notification?RRB technician
Peoples Motivation

RRB Recruitment 2024 నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

Thumbnailspm

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 9000 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. మార్చి 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ.

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో టెక్నీషియన్ పోస్ట్ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీల : 9,000

టెక్నీషియన్ పోస్టులను భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటనను విడుదల చేసింది.

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 09-03-2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:  08-04-2024

దరఖాస్తు ఫీజు

ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250/-

జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.500 రిజిస్ట్రేషన్‌ రుజుము కింద చెల్లించాలి.

జోన్ల వారీగా వివరాలు

1. అహ్మదాబాద్

2. అజ్‌మేర్

3. బెంగళూరు

4. భోపాల్

5. భువనేశ్వర్

6. బిలాస్‌పూర్

7. చండీఘడ్‌

8. చెన్నై

9. గువాహటి

10. జమ్ము అండ్‌ శ్రీనగర్

11. కోల్‌కతా

12. మాల్దా

13. ముంబయి

14. ముజఫర్‌పూర్

15. పట్నా

16. ప్రయాగ్‌రాజ్

17. రాంచీ

18. సికింద్రాబాద్

19. సిలిగురి

20. తిరువనంతపురం

21. గోరఖ్‌పూర్

ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు

దరఖాస్తుదారులు సంబంధిత ట్రేడ్‌లో నమోదిత NCVT/SCVT సంస్థ నుండి మెట్రిక్యులేషన్, SSLC లేదా ITI కలిగి ఉండాలి. ప్రత్యామ్నాయంగా, వారు సంబంధిత ట్రేడ్‌లో యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండవచ్చు.

వయోపరిమితి

జులై 1, 2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకైతే 18 నుంచి36 ఏళ్లు.

టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకైతే 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. 

జీతం వివరాలు

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు నెలకు రూ.19,900 వరకు జీతంగా చెల్లిస్తారు. 

ఎంపిక విధానం

రాత పరీక్ష, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. 

ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, 

సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2,

కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌,

డాక్యుమెంట్ వెరిఫికేషన్,

మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పోస్టుల వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య పోస్టుల సంఖ్య: 9000

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టుల సంఖ్య: 1,100

టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టుల సంఖ్య: 7,900

విద్యార్హతలు, ఎంపిక విధానం, సిలబస్‌ వంటి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

వెబ్సైట్: indianrailways.gov.in





Comments

-Advertisement-