INSAT -3DS ఉపగ్రహ ప్రయోగం విజయవంతం... కక్ష్యలో ప్రవేశపెట్టిన GSLV-F14
INSAT -3DS ఉపగ్రహ ప్రయోగం విజయవంతం... కక్ష్యలో ప్రవేశపెట్టిన GSLV-F14
తిరుపతి/ శ్రీహరికోట, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్):-
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇన్శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని GSLV-F14 రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి సాయంకాలం 5.35 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. జిఎస్ఎల్వీ వాహక నౌక 2,275 కేజీల బరువు గల ఇన్శాట్ 3డిఎస్ ఉపగ్రహాన్ని 18.46 నిమిషాల తర్వాత నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. నిన్న శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల కౌంట్ డౌన్ ప్రారంభం కాగా అది ఈరోజు 5:30 నిమిషాలకు 27 గంటల 30 తరువాత నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణ పరిస్థితులు తుఫాను లాంటి ఇబ్బందులు వర్షాభావ పరిస్థితులు మేఘాల గవనాలు సముద్ర ఉపరితల మార్పులపై స్పష్టమైన సమాచారం అందజేస్తుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలియజేశారు. కాగా గతంలో ఇన్శాట్ 3డీ ఇన్శాట్ 3డీఆర్ ఉపగ్రహాలను కొనసాగింపుగానే ఈ జిఎస్ఎల్వీ ఎఫ్-14 పంపుతున్నట్లు చైర్మన్ తెలిపారు. అయితే ఈ ప్రయోగం మొదలైన ఇరవై నిమిషాల తర్వాత జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీఓ) లో శాటిలైట్ ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత దశలవారీగా రెండు రోజులపాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి మారుస్తారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.