Damodaram Sanjeevaiah#రిక్షాలో అసెంబ్లీకి వెళ్లి నిజాయితీ చాటుకున్నా... ముఖ్యమంత్రి
రిక్షాలో అసెంబ్లీకి వెళ్లి నిజాయితీ చాటుకున్నా... ముఖ్యమంత్రి
దామోదరం సంజీవయ్య ప్రస్తుత కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో మాలదాసు కుటుంబంలో 14 ఫిబ్రవరి 1921 జన్మించారు. అతని చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. అతను పురపాలక పాఠశాలలో చదువుకున్నాడు మరియు అతను 1948లో మద్రాస్ లా కళాశాల నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. విద్యార్థిగా ఉన్నప్పటికీ, అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.
అతను 11 జనవరి 1960 నుండి 12 మార్చి 1962 వరకు ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి దళిత ముఖ్యమంత్రి. 24 జనవరి 1964 నుంచి 24 జనవరి 1966 వరకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశారు.
జీఓ 559తో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు. 1960లో దళితులకు 6 లక్షల ఎకరాల బంజరు భూముల పట్టాలను అందించారు. దామోదరం హయాంలోనే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్, మైనింగ్ కార్పొరేషన్, మౌలిక సదుపాయల సంస్థ, బీహెచ్‌ఈఎల్ ప్రారంభమయ్యాయి. తెలుగును అధికార భాషగా, ఉర్దూను రెండవ భాషగా ప్రోత్సహించడంతో పాటు వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని ఏర్పాటు చేశారు. 1961లోనే నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, మధ్యాహ్న భోజన పథకం, ఉపకార వేతనాలు ప్రవేశ పెట్టారు. మధ్య నిషేధాన్ని విభాగం, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశారు. గ్రేటర్ మున్సిపల్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు కూడా ఈయన కాలంలోనే చేశారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ‘లా’ కమిషన్ ఏర్పాటు తెలంగాణలో భూమిని రీ సర్వే చేయించారు.
ముఖ్యమంత్రిగా ఆయన రిక్షాలో అసెంబ్లీకి వెళ్లి నిజాయితీ చాటుకున్నారు. ఆయన మృతి చెందే వరకు ఆయనకున్న ఆస్తి.. దుస్తులు, భోజనం చేసేందుకు ఒక పళ్లెం, గ్లాసు తప్ప మరొకటి లేవు. ఇతను 7 మే 1972 (వయస్సు 51) సంవత్సరాల వయసులో మరణించారు.