Cyber Security @సైబర్ భద్రత కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సైబర్ భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
👉మీరు వాడే ఫోన్ అయినా కంప్యూటర్ అయినా ఆటోమేటిగ్గా అప్డేట్ అయ్యేలా చూసుకోండి.
👉యాంటీవైరస్ ప్రొటెక్షన్ ఉండేలా జాగ్రత్త వహించండి.
👉పాస్వర్డ్లు పదేపదే మారుస్తూ ఉండాలి. పాస్వర్డ్ హింట్ బయటకు కనిపించేలా ఉండకూడదు. పాస్వర్డ్ స్ట్రాంగ్ గా ఉండాలి.
👉మీ వ్యక్తిగత సమాచారం గురించి అడిగే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త గా ఉండండి. మీకు తెలియని వ్యక్తుల నుండి ఈ మెయిల్స్ వస్తే తెరవకండి.
👉అదనపు రక్షణ కోసం మల్టీ ఫ్యాక్టర్ అతెంటికేషన్ ఎంచుకోవాలి.
👉మొబైల్ ఫోన్ పాస్ కోడ్ ఇతరులు ఊహించే తేలికగా ఉండకూడదు.
👉మీ డేటా ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవాలి.
👉అపరిచితులు పంపించే వెబ్సైట్ లింకులను ఓపెన్ చేయకుండా జాగ్రత్త ఉండాలి.
👉మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీ, వంటి సమాచారం (పర్సనల్ ఐడెంటిఫయబుల్ ఇన్ఫర్మేషన్-PII) ఇతరులతో పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి.
👉ఆన్లైన్ అకౌంట్లను తరచూ చూసుకుంటూ ఉండండి. ఆ విధంగా ఏదైనా తేడా ఉంటే బ్యాంకుకు తెలియపరచవచ్చు.
👉పబ్లిక్ వై-ఫై వాడేటప్పుడు తప్పనిసరిగా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(VPN) ఉపయోగించండి. దీని వల్ల హ్యాకర్స్ కు సమాచారాన్ని దొంగలించడానికి వీలుపడదు.