శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశంలో కీలక తీర్మానాలు...టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి.
శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశంలో కీలక తీర్మానాలు...
టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి...
కర్నూలు నగరంలో కళ్యాణ మండపం...
-శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి
శ్రీశైలం/నంద్యాల జిల్లా, (పీపుల్స్ మోటివేషన్):-
శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశంలో కీలక తీర్మానం చేశారు. గురువారం శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ...మహా కుంభాభిషేకాన్ని విజయవంతంగా జరిపించిన దేవస్థాన ఈఓ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశం సుమారు 4 గంటలపాటు కొనసాగింది. అనంతరం మొత్తం 50 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 ప్రతిపాదన వాయిదా వేశారు.. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించామని వెల్లడించారు. ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి.. అలాగే శ్రీశైలంలో భక్తులు, స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కర్నూలు నగరంలోని దేవస్థానం సమాచార కేంద్రం వద్ద కళ్యాణ మండపం, వాణిజ్య సముదాయానికి రూ.8 కోట్ల 60 లక్షలకు ఆమోదించారు. వీటితోపాటు సున్నిపెంటలో నిర్మిస్తున్న సిబ్బంది వసతిగృహాలకు నీటి సరఫరాకి ఏర్పాటుకు అంచనా వ్యయం రూ. 15 కోట్లు ఆమోదించారు. క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా సూపరింటెండెంట్ ఇంజనీరు పోస్ట్ ఏర్పాటుకు దేవాదాయశాఖకు ప్రతిపాదనలకు తీర్మానించారు. అలానే దేవస్థానంలో క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించామని ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియాకు తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేవస్థాన ఈఓ డి.పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరుపాక్షయ్య స్వామి, సుజాతమ్మ, నరసింహారెడ్డి, విజయలక్ష్మి, మురళి, హనుమంతు నాయక్, మధుసూదన్ రెడ్డి, మాధవీలత, ధర్మరాజు, జగదీశ్వర్ రెడ్డి, రామ్మో హన్ నాయుడు, డిప్యుటీ కార్యనిర్వహణాధికారిణి రమణమ్మ, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.