పోలీసుల మొబిలైజేషన్ కార్యాక్రమం విజయవంతం
బదిలీపై వెళ్తున్నా ASP 01, DSP లు 3,RI లు 02,RSI లు 05 మందికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు ....
ఏ.ఆర్ సిబ్బంది పట్టుదలతో ఈ మొబిలైజేషన్ కార్యాక్రమం విజయవంతం చెయ్యడం చాలా సంతోషించవలసిన విషయం....
-జిల్లా ఎస్పీ K. రఘువీర్ రెడ్డి
నంద్యాల జిల్లా సాయుధ పోలీసు బలగాలు ఏర్పాటు చేసిన “మొబిలైజేషన్ " ముగింపు కార్యక్రమం మరియు పోలీస్ అదికారుల వీడ్కోలు కార్యక్రమం నంద్యాల పట్టణం లోని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ కార్యాక్రమంలో పాల్గొన్న కానిస్టేబుల్ నుండి ఆఫీసర్ అందరినీ జిల్లా ఎస్పీ అబినందించారు. ఎందుకనగా మనకున్నసౌకర్యాలను ఉపయోగించుకొని చాలా విజయవంతంగా మీరు మొక్కవోని ధైర్యం, పట్టుదల,అకుంటిత దీక్ష తో ఈ మొబులైజేషన్ కార్యాక్రమం నిర్వహించడం నిర్విఘ్నగా విజయవంతంగా ముగించుకోవడం చాలా సంతోషంగా మరియు గర్వంగా ఉంది అని తెలియజేశారు. సిబ్బంది మరియు అదికారులు మొత్తం 274 మంది పాల్గొన్నారు. సిబ్బంది అదికారులు అందరూ నిత్య విధ్యార్థులుగా ఉండాలని సమాజంలో, చట్ట పరిదిలో జరుగుచున్న మార్పులు శాంతిభద్రతలో కొత్తగా తలెత్తే సమస్యలపట్ల అవగాహన కలిగి ఉండాలని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నిరంతరం మన వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాబోయే రోజులలో మరియు మన ముందున్న ఎన్నికలలో మన విధులలో మనం ఎదుర్కొనబోయే అవరోదాలను అదిగమించే విదంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఈ మొబలైజేషన్ కార్యక్రమం జిల్లా సాయుధ పోలీసు బలగాలు సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి తెలియజేశారు. ఏ.ఆర్ సిబ్బందికి ప్రతీ ఏటా మొబలైజేషన్ కార్యక్రమం అనేది ఒక రీఫ్రెష్మెంట్ కోర్స్ లాంటిదని మీదైనందిన విధులలో మెరుగుపరుచుకునేందుకు విధులలో నైపుణ్యం, ఫిజికల్ ఫిట్ నెస్ ను మెరుగుపరచడం జరగాలని,ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ మొబలైజేషన్ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు.
ఈ మొబిలైజేషన్ లో భాగంగా ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. బి.డి టీం, ప్రిజనర్స్ ఎస్కార్ట్ , పి.ఎస్ .ఒ లు, డ్రైవర్స్ , తదితర సిబ్బంది తమకు కేటాయించిన విధుల్లో నైపుణ్యాన్ని బాగా మెరుగుపరుచుకోవాలని పలు మెళకువలు అదికారుల ద్వారా తెలుకున్నారని మరియు NDRF బృందాల లాగానే మన జిల్లా ఆర్ముడు రిజర్వు పోలీస్ విభాగంలో కూడా అలాంటి టీం ను ఒకటి ఏర్పాటు చేసుకోవాలని ఈ టీం ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సేవలందించుటకు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు.
ఫైరింగ్ , డ్రిల్ , కవాతు, మాబ్ కంట్రోల్ , ప్రముఖుల బందోబస్తు, తదితర విధులు మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించవచ్చో దిశానిర్ధేశం చేశారు. సిబ్బంది సంక్షేమంలో భాగంగా సిబ్బంది ఆరోగ్యపరంగా మరియు సిబ్బంది యొక్క పిల్లలకు మంచి విద్యను ఇవ్వడం కొరకు కృషి చేయాలని పై విషయాలలో ఏవైనా సహాయం కావాలనుకుంటే నేరుగా నన్ను సంప్రదించవచ్చునని తెలియజేశారు.
నంద్యాల జిల్లా నుండి 13 మంది అదికారుల వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఉద్యోగంలో బదిలీలు సర్వ సాదారణం అని ఎక్కడ ఉన్న దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించాలని కోరుకొనుచున్నానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ G. వెంకట రాముడు, ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, DSP మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాసరావు వెంకటరామయ్య శ్రీనివాస రెడ్డి సంతోష్,మారుతీరావు,ఏ.ఆర్ DSP రంగముని, నంద్యాల జిల్లా ఇన్స్పెక్టర్ లు,రిజర్వు ఇన్స్పెక్టర్ సుధాకర్,శ్రీనివాసులు ,మంజునాథ్ ,RSI లు దాదా పీరయ్య , అల్లావుద్దీన్,వీరన్న,సోమశేఖర్,హర్షవర్ధన్ రెడ్డి ,ఖాళీశ్రీచరణ్ సిబ్బంది పాల్గొన్నారు.