జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
Orvakal school news, sports news, kurnool sports news,
By
Peoples Motivation
ఓర్వకల్లు న్యూస్, ఫిబ్రవరి 03 (పీపుల్స్ మోటివేషన్):-
జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడా పోటీల్లో ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ కాకతీయ హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల యాజమాన్యం వారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 42వ జాతీయస్థాయి షూటింగ్ బాల్ అండర్-19 బాలుర విభాగం క్రీడల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించిందన్నారు.
ఈ విజయంలో కాల్వబుగ్గ కాకతీయ హై స్కూల్ కు చెందిన క్రీడాకారులు అభిలాష్(కెప్టెన్), నరేష్, సాయి చరణ్ నాయక్ లు కీలక పాత్ర పోషించిన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాకతీయ హై స్కూల్ యాజమాన్యం దేవిక, సూర్యతేజ, ఉమ్మడి జిల్లాకు చెందిన షూటింగ్ బాల్ సెక్రటరీలు సురేష్ కుమార్, ఈశ్వర్ నాయుడు, పాఠశాల హెచ్ఎం మనోహర్, ఇతర ఉపాధ్యాయులు క్రీడాకారులను అభినందించారు.
Comments