ఆదర్శ గ్రామ రైతన్నలు ఆలోచించండి...
ఆదర్శ గ్రామ రైతన్నలు ఆలోచించండి...
-రైతుల సమస్యలు పట్టించుకునే ప్రభుత్వం బిజెపి.
-8 మంది మాజీ సైనికులకు సన్మానం..
దేశంలోనే ఆదర్శ గ్రామంగా గా పేరొందిన రైతన్నలు అభివృద్ధి చేసే వారు ఎవరో ఆలోచించాలని నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు పేర్కొన్నారు. బిజెపి అధిష్టానం ఆదేశాల మేరకు పల్లెకు పోదాం అనే కార్యక్రమం పాండురంగాపురం గ్రామంలో నిర్వహించారు. ముందుగా దేవాలయంలో పూజలు నిర్వహించారు.గ్రామం లో తిరిగి ఆదర్శ గ్రామానికి నిదర్శనంగా నిలుస్తుంది అన్నారు. దేశ రక్షణకోసం పని చేసిన 8 మంది మాజీ సైనికులకు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలలో మాట్లాడుతూ దూర ప్రాంతాలనుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి కలిసికట్టుగా గ్రామ అభివృద్ధితో పాటు మంచి పంటలు పండించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. దేశవ్యాప్తంగా పాండు రంగాపురం గ్రామానికి,గ్రామ రైతులకు మంచి పేరుతో పాటు ఇక్కడి ప్రజలకు గుర్తింపు తెచ్చారని అన్నారు.ఫ్రీడమ్ ఫైటర్ యార్రబోలు సుబ్బారెడ్డి లాంటి ఎందరో స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానుభావులను చూశామని అన్నారు.వ్యవసాయంలో మెళుకువలు పస్తి మంచి పంటలు పండించారు అన్నారు.దేశంలో రైతులు,దేశ రక్షణ,పేద ప్రజల కోసం నిరంతరం పలు పథకాలు కేటాయిస్తున్న ప్రభుత్వం బిజెపి ప్రభుత్వమని గుర్తుచేశారు. బిజెపి పార్టీ నీ గెలిపించుకునే దేశం మరింత అభివృద్ది చెందుతుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని అన్నారు.ప్రపంచదేశాలు అన్ని భారత్ లా అభివృద్ధి చెందాలని చూస్తున్నాయని అన్నారు.500 ఏళ్లు ఎదురుచూస్తున్న అయోధ్యలో రామజన్మ మందిరం ఏర్పాటు చేసిన ఘనత బిజెపి కి దక్కుతుందని అన్నారు.ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ,సర్పంచ్ మాట్లాడుతూ అయోధ్యలో రామాలయం నిర్మించిన మోది కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడా మురళీధర్,గురుబ్రహ్మ,రామకృష్ణా రెడ్డి,స్వాతి,గంగాధర్,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.