డోన్ పట్టణంలో టీడీపీ శ్రేణులు సంబరాలు
డోన్ పట్టణంలో టీడీపీ శ్రేణులు సంబరాలు
డోన్, ఫిబ్రవరి 24 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తరపున కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి కి కేటాయించడంతో కోట్ల, కేఈ వర్గీయులు, జనసేన కార్యకర్తలు డోన్ పట్టణంలో పాదయాత్రగా వెళుతూ కేఈ మాదన్న, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం బాణాసంచాలు పేల్చి, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడుతూ కోట్ల, కె.ఈ, వర్గీయులు, జనసేన కార్యకర్తలు అందరం ఒకటిగా ప్రజల్లోకి వెళ్లి వందకు 100 శాతం కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్కసారం లక్ష్మిరెడ్డి, డోన్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ టి ఈ కేశన్న గౌడ్, ఓం ప్రకాష్, సండ్ర పల్లె ఆచారి, ఓబులాపురం శేషిరెడ్డి, భూమా నాగన్న జనసేన నాయకులు ఆలమోహన్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.