రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

భయపడుతున్న వైసీపీ టీడీపీ పార్టీ నేతలు

Political news
Peoples Motivation

 

తమను కూడా జైళ్లకు పంపిస్తారేమోనని కేంద్ర ప్రభుత్వం చేసే నల్ల చట్టాలను వ్యతిరేకించేందుకు భయపడుతున్న వైసిపి టిడిపి పార్టీ అధినేతలు

10 కోట్ల మందికి ఉపాధి కల్పించే ప్రైవేటు రవాణా రంగాన్ని దివాలా తీయించి అధాని అంబానీ లాంటి వారికి అప్పజెప్పేందుకే ఈ కుట్ర

డ్రైవర్లను జైల్లో పంపే నల్ల చట్టాన్ని, సెన్సార్ కెమెరాల ఫైన్లను రద్దు చేయాలని గాంధీ విగ్రహం ఎదుట జరిగిన ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్న డ్రైవర్లు



కర్నూలు, ఫిబ్రవరి 04 (పీపుల్స్ మోటివేషన్):-

రోడ్ల కండిషన్,ఏ వాహనం ఎటువైపు వెళ్లాలనే సమస్యలను శాస్త్రీయంగా పరిశీలించకుండా ఏళ్ల తరబడి డ్రైవర్లను జైళ్లలో పెట్టడంతో పాటు వారి కుటుంబాలను వస్తువులకు గురి చేసే నల్ల చట్టాలను రద్దు చేయాలని కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం ముందు భారీ ధర్నా జరిగింది. సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ సౌత్ ఇండియా అధ్యక్షులు ఎస్ అన్వర్ భాష, పట్టణ పౌర సంక్షేమ సంఘం(PPSS)రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరిగినేని పుల్లారెడ్డి, సేఫ్టీ డ్రైవర్ల అసోసియేషన్ జిల్లా నాయకులు ఎం మహేష్,ఎస్ జహీర్ అహమ్మద్, నాగ సుబ్బారాయుడు మాట్లాడుతూ తమను కూడా జైళ్లకు పంపిస్తారేమోనని నల్ల చట్టాలను వ్యతిరేకించేందుకు వైసిపి టిడిపి పార్టీల అధినేతలు భయపడుతున్నారా అని ప్రశ్నించారు. దేశంలో 10 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ప్రైవేటు రవాణా రంగాన్ని దివాలా తీయించి కార్పోరేట్లకు ఈ రంగాన్ని కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి వరకు,ఎంపీ నుండి ప్రధానమంత్రి వరకు రాత్రి పగలనక సేవలు సేవలందిస్తున్న డ్రైవర్లకు ఉరితాడు లాంటి ఈ చట్టాన్ని వ్యతిరేకించాలనే స్పృహ కూడా లేకపోవడం బాధాకరమన్నారు. జగన్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల ప్రభుత్వ ఆదాయం కోసం సెన్సార్ కెమెరాలు పెట్టి ప్రతిరోజు వేలాదిమందిపై జర్మానాలు విధిస్తున్నారని విమర్శించారు.


డ్రైవర్లను జైల్లోకి పంపించే 106(1),106(2) చట్టాలను సెన్సార్ కెమెరా ల ద్వారా వేసిన కోట్లాది రూపాయల చర్మానాలను వెంటనే రద్దు చేయాలని కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈనెల 16న దేశవ్యాప్తంగా జరిగే సమ్మె సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొంటామని హెచ్చరించారు. ఏ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో డ్రైవర్లు,ఓనర్ కమ్ డ్రైవర్లతోపాటు బి శంకరయ్య శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-