నంద్యాల పార్లమెంట్ బరిలో ఎవరూ..?
నంద్యాల పార్లమెంట్ బరిలో ఎవరూ..?
బిజ్జ మా..? బైరెడ్డి నా..? మాండ్ర..నా???
-----------------------
నంద్యాల పార్లమెంట్ అనేది భారతదేశంలోనే తెలియని వారు ఉండకపోవచ్చు. ఎంతోమంది ప్రముఖ నాయకులను అందించిన పార్లమెంట్ ఇది. పెండేకంటి వెంకటసుబ్బయ్య, మద్దూర్ సుబ్బారెడ్డి, బొజ్జ వెంకటరెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, ఎస్పీవై రెడ్డి లాంటి నాయకులు ఎన్నికైన లోక్ సభ నియోజకవర్గం ఇది. తెలుగు ప్రజల ఆత్మాభిమానం భారత ప్రధాని పీవీ నరసింహారావుని, దేశ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి లాంటి ఉద్దండులు పాలించిన నేల నంద్యాల పార్లమెంట్. అలాంటి పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీ నుండి మాండ్ర శివానందరెడ్డి, బెజ్జం పార్థసారథి రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టికెట్ కోసం నాకంటూ నాకు అని పోటీ పడుతున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే బిజ్జం పార్థసారథి పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి బరిలోకి దింపుతారని, బిజ్జం అయితేనే ఏడు నియోజకవర్గాలపై ప్రభావం చూపగలరని తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంటులోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో క్లీన్ స్వీప్ చేయగలదని చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బిజ్జం పార్థసారథి రెడ్డి గతంలో పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అభిమానంతో, చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడని ఉమ్మడి కర్నూలు జిల్లాలో బిజ్జం అంటే చంద్రబాబు నాయుడు మాట చెప్పినట్టే అని అనుకునేవారు. అంతేకాకుండా బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, శ్రీశైలం ఈ నియోజకవర్గాలలో బంధువర్గం, అంతరవర్గం బలంగా ఉండటం కూడా ఇతనికి కలిసొచ్చే అంశం. డోన్ నియోజకవర్గంలో ప్యాపిలి మండలంలో చల్లా రామకృష్ణ వర్గానికి వ్యతిరేకంగా బలమైన వర్గమే ఉంది. ఆర్థికంగా కూడా బలంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటేనే బగ్గుమంటున్న చంద్రబాబు నాయుడు బిజ్జం పార్థసారథి రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడితే ఒక్క బేతంచెర్ల మండలంలోనే తెలుగుదేశం పార్టీకి 10,000 పైన మెజార్టీ వస్తుందని ఈజీగా ఓడించవచ్చని కాబట్టి బిజ్జం వైపే తెలుగుదేశం పార్టీ అధినేత ముగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో నందికొట్కూరు ప్రాంతంలో తిరుగులేని నేతగా ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నంద్యాల పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం ఉంటుందని, అంతేకాకుండా రాయలసీమ హక్కుల కోసం పోరాడిన నేతగా ఉన్న బైరెడ్డి నీ పార్లమెంటు బరిలో దించితే ఫలితాలు రావచ్చా అనే కోణం నుండి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ని ఎటువంటి పరిస్థితుల్లో అడ్డుకోవాలని మండ్ర శివానందరెడ్డికి నంద్యాల పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని గౌరు దంపతులు బాబుకు విన్నవించుకున్నట్లు సమాచారం. మండ్ర శివానందరెడ్డికి, గౌరు దంపతులకు అత్యంత దగ్గర బంధుత్వం కూడా ఉంది. ఇతడు గత పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిన సంగతి అందరికీ తెలిసిందే. శివానంద రెడ్డి విశ్రాంత పోలీస్ ఆఫీసర్. ఏది ఏమైనా బిజ్జం కే టిక్కెట్ ఇస్తారని పక్కా విశ్వసనీయ సమచారం. అతి త్వరలోనే ఈ పార్లమెంట్ ఎవరికి దక్కబోతుంది అని వేచి చూడక తప్పదు...