సండే ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ భూదాహానికి బలవుతున్న కానాల
సండే ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ భూదాహానికి బలవుతున్న కానాల
గ్రామ పేద రైతులు, కానాల గ్రామ అభివృద్ధికి ఆమడ దూరం -ఎన్ ఎం డి ఫిరోజ్
నంద్యాల జిల్లా, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్):-
కానాల గ్రామం నందు చాయ్ పే చర్చా కార్యక్రమంలో ఎన్ ఎం డి ఫిరోజ్ మాట్లాడుతూ...
కానాల గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు. కేవలం ఈ శిల్పా కుటంబం కానాల చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రైతుల భూములను తక్కువ ధరకు బలవంతంగా కొనుక్కుని రియల్ ఎస్టేట్ భూదందాలు చేస్తూ ఈ ప్రాంత రైతులను హింసిస్తున్నారన్నారు. రైతులు భూములు అమ్ముకోవాలే తప్ప ఈ శిల్పా కుటుంబం వారి కోసం అభివృద్ధి చెయ్యారని ధ్వజమెత్తారు. కానాల గ్రామంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ గ్రామ ప్రజలు వైద్య సేవల కోసం నంద్యాలకు పరిస్థితి ఉందన్నారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యే గా ఈ కుటుంబం ఇంకా రోడ్లు కాలువలు వీధి దీపాలు కూడ సరిగ్గా లేవన్నారు. కానాల గ్రామ ముస్లింల ఈద్గాహ్ మస్జీద్ కు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కేవలం ఈ ఎమ్మెల్యే కుటుంబం ఎన్నికల సమయంలో గ్రామంలో ఎజెంట్లను పెట్టి డబ్బులు పంచి ఓట్లు పొందుతున్నారని వీళ్లకు ప్రజల సమస్యలు పట్టవని కేవలం వీళ్లకు రియల్ ఎస్టేట్ నుండి కోట్లు కావాలని అన్నారు.
నంద్యాల ప్రజలు ఈసారి సండే ఎమ్మెల్యే ని ఓడగోడుతున్నారని తెలిసి మా తెలుగుదేశం కార్యకర్తలకు డబ్బు ప్రలోభాలు పెట్టి గెలవాలని కుట్రలు పన్నుతున్నారు. ఈసారి రాబోయేది టీడీపీ ప్రభుత్వమే వచ్చేది ఎన్ ఎం డి ఫరూక్ మాత్రమే.. ఎంత ఖర్చు చేసిన ఎంత మందితో వచ్చిన ఈ సారి మార్పు ఖాయమే అని తెలిపారు. రాబోయే నంద్యాల ఎన్నికల్లో కానాల గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో మన ఎన్ ఎం డి ఫరూక్ ని గెలిపించుకోని నంద్యాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.