రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బాలుడి కిడ్నాప్ జరిగిన మూడు గంటల్లో ఛేదించిన పోలీసులు..కన్న తండ్రే నిందితుడు..

crime news, Kidnaping news, police news, Atp police news,
Peoples Motivation

బాలుడి కిడ్నాప్ జరిగిన మూడు గంటల్లో ఛేదించిన పోలీసులు..కన్న తండ్రే నిందితుడు..

బాలుడిని తల్లికి సురక్షితంగా అప్పగించిన పోలీసులు

భార్యతో విడాకులు తీసుకుని కిడ్నాప్ నకు ఒడిగట్టిన వైనం

జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తీవ్రంగా పరిగణించారు.

స్పెషల్ బృందాలచే గాలింపు కిడ్నాప్ కథ సుఖాంతం..తండ్రిని అరెస్ట్ 

మీడియాకు వివరాలు వెల్లడించిన కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు


అనంతపురం/ కళ్యాణదుర్గం, (పీపుల్స్ మోటివేషన్ న్యూస్):-

అనంతపురం జిల్లా శెట్టూరు పోలీసులు బాలుడి కిడ్నాప్ ఘటనను కేవలం మూడు గంటల్లో ఛేదించారు. బాలుడిని  సురక్షితంగా తల్లికి అప్పగించారు.

వివరాల్లోకి వెళితే... 

శెట్టూరు మండలం చిన్నంపల్లి తిమ్మక్కకు కర్నాటక రాష్ట్రం బండమీద అచ్చంపల్లి గ్రామానికి చెందిన ముత్రాసి సంజీవరాయుడితో 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో విడాకులు కూడా తీసుకున్నారు. అప్పటి నుండీ తిమ్మక్క తమ కుమారుడైన రంజిత్ తో కలసి చిన్నంపల్లిలోనే నివసిస్తోంది. ఈ అబ్బాయి చిన్నంపల్లి పాఠశాలలో 4 వ తరగతి చదువుతున్నాడు. ఈరోజు ముత్రాసి సంజీవరాయుడు చిన్నంపల్లికీ వచ్చి రంజిత్ కు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి ద్విచక్ర వాహనంపై ఎత్తుకెళ్లాడు. ఈమేరకు బాలుడి తల్లి మధ్యహ్నాం 2 గంటలకు శెట్టూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణించి వెంటనే కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


      ‌ఈ కేసు క్రైమ్ నెంబర్ 24/2024 U/s 363 IPC నమోదు చేశారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, సి.ఐ నాగరాజుల పర్యవేక్షణలో శెట్టూరు ఎస్సై రాంభూపాల్ ఆధ్వర్యంలో స్పెషల్ బృందాలు రంగంలోకి దిగి పక్కాగా వచ్చిన సమాచారంతో సుమారు సాయంత్రం 5.00 గంటల సమయంలో కంబదూరు బార్డర్ చెక్ పోస్ట్ వద్ద ముత్రాసి సంజీవరాయుడిని అరెస్టు చేసి అతని వద్దనున్న రంజిత్ ను తల్లి తిమ్మక్కకు అప్పగించారు. కేవలం 3 గంటల్లో కిడ్నాప్ ఘటనను ఛేదించిన శెట్టూరు ఎస్సై రాంభూపాల్, హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి, కానిస్టేబుల్ శీనాను జిల్లా ఎస్పీ అభినందించారు.

Comments

-Advertisement-