అల్లరి చేస్తున్నాడని విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్
అల్లరి చేస్తున్నాడని విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్
ఆలూరు, ఫిబ్రవరి 15 (పీపుల్స్ మోటివేషన్):-
విద్యార్థి అల్లరి చేస్తున్నాడని చేతులు వాచేలా కొట్టిన ఘటన ఆలూరు పట్టణంలో చోటు చేసుకుంది. విద్యార్థి తల్లిదండ్రుల వివరాల ప్రకారం పెద్దహోతూరు గ్రామానికి చెందిన భాస్కర్ కుమారుడు జశ్వంత్ ఆలూరు పట్టణంలోని సాయిశ్రీ పేరుతో నడుస్తున్న శ్రీ చైతన్య స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు.
ఈ నెల 13న జశ్వంత్ అల్లరి చేస్తున్నాడని అతని స్నేహితుడు వెళ్లి ప్రిన్సిపాల్ కు చెప్పగా దీంతో ప్రిన్సిపాల్ అర్చన విద్యార్థినిని పిలిచి బండలు తుడిచే కర్రతో చేతులు వాచేలా కొట్టింది.ఈ విషయాన్ని జశ్వంత్ తల్లిదండ్రులకు చెప్పకుండా రెండు రోజులు స్కూల్ కి వెళ్లలేదు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఎందుకు స్కూల్ వెళ్లడంలేదని ప్రశ్నించగా ప్రిన్సిపల్ కొట్టడంతో చేయి వాపు వచ్చి తీవ్రంగా నొప్పి వేస్తుందని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు డీవైఎఫ్ఎ నాయకులతో కలిసి గురువారం స్కూల్ కి వెళ్లి అర్చనతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సీఐ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేయగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
డీవైఎఫ్ఎ నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనకు కారణమైన ప్రిన్సిపాల్ అర్చన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సిఐ వెంకటేశ్వర్లు కి ఫిర్యాదు చేస్తున్న తల్లిదండ్రులు మరియు డీవైఎఫ్ఎ నాయకులు