దయచేసి వాస్తవ విషయాలపై పోస్టులు పెట్టండి. ఫేక్ విషయాలను ప్రచారం చేయొద్దు ..
దయచేసి వాస్తవ విషయాలపై పోస్టులు పెట్టండి...
ఫేక్ విషయాలను ప్రచారం చేయొద్దు...
-జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్

అనంతపురం (పీపుల్స్ మోటివేషన్):-
ఇటీవల అనంతపురం శివార్లలో పశువులను ఇక్కడి నుంచీ అక్రమంగా తరలిస్తున్నట్లు ఓ వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెట్టారు.. దీనిపైన అప్రమత్తమై పోలీసులు ఆరా తీశారు. వివిధ ప్రాంతాలలోని సంతలలో రైతుల నుండీ కొనుగోలు చేసిన ఎద్దులను తరలిస్తున్న వాహనం ట్రబుల్ ఇవ్వడంతో పామురాయి శివార్లలోని పొలాల్లో వాటిని దింపి మేత పెట్టారు. ఆ పశువులన్నీ కూడా ఎద్దులే. అందునా వయస్సుమీద పడినవేనని తేలింది.
ఎస్పీ మాట్లాడుతూ...నిజానిజాలు తెలుసుకోకుండా పోస్టులు పెడుతూ ప్రజల్ని అయోమయంలోకి నెడుతున్నారని
అలాగే పోలీసులకు సమయం వృథా చేస్తున్నారు. ఇలాంటి పోస్టింగులు పెట్టే వారు ఒకసారి ఆలోచించాలని..వాస్తవమైన సమాచారాన్ని షేర్ చేస్తే తప్పు లేదని. కేవలం సంచలనాల కోసం లేనిపోని తప్పుడు ప్రచారాలు చేయకూడదని అన్నారు.
ఈ మధ్యకాలంలోనే ఒరిస్సా నుండీ బెంగుళూరు, కేరళలకు పశువులను తరలిస్తున్న కంటైనర్ జిల్లాలోని కాశేపల్లి టోల్ గేట్ సమీపంలో బోల్తాపడింది. ఒక చోట నుండీ ఇంకొక చోటకు జిల్లా గుండా అక్రమంగా తరలిస్తున్న ఈ ఘటనను తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి నిందితులను పక్కాగా అరెస్టు చేశారు. జిల్లాలో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారనడానికి కంటైనర్ లారీబోల్తా ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు.