ప్రతి ఒక్కరూ సేవామార్గంలో నడవాలని పిలుపు
ప్రతి ఒక్కరూ సేవామార్గంలో నడవాలని పిలుపు
మహంకాళి ఆలయానికి గ్రానైట్ ను అందించిన సినీ ఆర్టిస్ట్...
ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తా...
వృద్ధులు, అనాథలకు సాయపడుతున్న
-సినీ నటి తన్వి
హైదరాబాద్/మాదాపూర్, ఫిబ్రవరి 29 (పీపుల్స్ మోటివేషన్ న్యూస్):-
మాదాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం పక్కనే వెలిసిన మహంకాళి ఆలయానికి సినీనటి శిరీష అలియాస్ తన్వి గ్రానైట్ ను అందించింది. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఆమె పేర్కొన్నారు.
మహంకాళి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలన్నారు. అనాథలకు, వృద్ధులకు తనవంతు సాయం అందిస్తున్నట్లు చెప్పారు. తనకు చిన్నప్పటి నుంచి సేవాభావం ఎక్కువ అని, తన తల్లిదండ్రులు, పెద్దలు ఇతరులకు సాయపడాలని ఎప్పుడూ చెబుతూ ఉండేవారన్నారు. వారి సూచన మేరకు తనవంతుగా సేవా మార్గంలో ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
తాను ప్రస్తుతం సినీరంగంలో రాణిస్తున్నానని, మంచి అవకాశాలు తనకు మహంకాళి అమ్మవారి కృపతో వస్తున్నాయని తెలిపారు. నలుగురికి సాయపడడం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ప్రతిఒక్కరూ సేవామార్గంలో నడవాలని ఆమె పిలుపునిచ్చారు.