రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సంసిద్ధం కావాలి..

ELECTION COMMISSION OF AP, ANDHRA PRADESH NEWS, VIJAYAWADA NEWS, ELECTIONS NEWS, MUKESH KUMAR MEENA IAS, ANDHRA ELECTIONS
Peoples Motivation

ఎన్నికల  నిర్వహణకు పూర్తి స్థాయిలో సంసిద్ధం కావాలి...
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా

విజయవాడ, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్):- సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సంసిద్ధం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు.

విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి ఎన్నికల సన్నద్ధతపై అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమావేశం నిర్వహించారు.

Image

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులే కాక మైనర్ రూట్స్ లో కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకోవడానికి గాను సరిహద్దు జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. అదే విధంగా ఎఫ్ఎస్టీ (ఫాస్ట్ సర్వేలెన్స్ టీమ్), ఎస్ఎస్టి (స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్) విభాగాలకు ఒక పోలీసు సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించడంతో పాటు 3 టీమ్స్ గా ఏర్పాటు చేయాలని ప్రతి టీమ్ లో ఒక వీడియోగ్రాఫర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతర్జిల్లాలకు సంబంధించి పోలింగ్ కు 48 గంటల ముందు సంబంధిత నియోజకవర్గ ఓటర్లు మాత్రమే ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ ఆఫీసర్లకు సంబంధించిన ఎపిక్ కార్డుల వివరాలు కూడా తీసుకొని డేటా బేస్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. పోలీసు సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాలలో ఎన్సిసి సిబ్బంది వివరాలను నమోదు చేయాలని ఎన్నికల కమీషన్ అనుమతి ఇస్తే వారి సేవలను కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

ఈ సమావేశంలో ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-