రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అమరజీవి పొట్టిశ్రీరాములు, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహా ఆవిష్కరణ

GENERAL NEWS, TELUGU NEWS, AP NEWS, POLITICAL NEWS, NANDYAL DIST NEWS
Peoples Motivation

అమరజీవి పొట్టిశ్రీరాములు, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహా ఆవిష్కరణ

అవినీతికి ఆస్కారం లేకుండా సేవలు

ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యం

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

Thumbnailspm1

డోన్ : ఫిబ్రవరి 23 ( పీపుల్స్ మోటివేషన్ )

డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్ లో 'వాలంటీర్లకు వందనం' కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సత్కరించారు. ప్రజలకు సేవలందించడంలో విశేష కృషి చేసిన వారిని గుర్తించి గౌరవించడం అసలైన పురస్కారం అని మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సీఎం సృష్టించిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నెరవేరిందనే ఉద్దేశంతోనే 'వలంటీర్లకు వందనం' కార్యక్రమం ఇవాళ నిర్వహించాం అన్నారు. అందుకోసమే పాత బస్టాండు సెంటర్ లో మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు క్షేత్రస్థాయికి చేరాలన్నది మహాత్ముడి స్వప్నం ఆలోచనలను ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ పరిపాలన అవినీతికి ఆస్కారం లేకుండా సేవలందించే విధానమే వాలంటీర్ వ్యవస్థ ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా సాధ్యంఫ్యాను ఇంట్లో ఉండాలి, సైకిల్ బయటుండాలి, టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. డోన్ వాలంటీర్ లావణ్య మాట్లాడుతూ... ప్రభుత్వ పురస్కారం మాకు మరింత ప్రోత్సాహకరంమా వార్డులో ఒకరికి రేషన్ కార్డు చేతిలో పెడితే చేతులెత్తి మొక్కారు. వృద్ధులకు పింఛన్ కష్టాలు సీఎం జగన్ వచ్చాక తొలగిపోయాయి. డోన్ లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి. డోన్ మండల వాలంటీర్ మనోజ్ మాట్లాడుతూ...ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లాంటి నాయకుడు రాజకీయాలలో అరుదుగా ఉంటారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులు కూడా చేతులెత్తి నమస్కరించేలా మంత్రి బుగ్గన వ్యక్తిత్వం అని కొనియాడారు. ప్యాపిలి, డోన్ మండలాల వెనకబాటు చూసి ఎంతో బాధపడేవాడిని ఈ ప్రభుత్వంలో డోన్ అభివృద్ధి మాటల్లో చెప్పలేనిది అన్నారు. వాలంటీర్లకు పురస్కారాలతో పాటు ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్యాపిలి మండలం వాలంటీర్ రహంతుల్లా మాట్లాడుతూ...వార్డు ప్రజలంతా కుటుంబసభ్యులుగా మమ్మల్ని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చలువ వల్లే మా సేవకు గుర్తింపు అన్నారు. ప్యాపిలి అభివృద్ధి తెలంగాణ వరకూ పాకింది అవినీతికి అవకాశమే లేకుండా అర్హులకు అన్ని పథకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మీట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, బేతంచెర్ల ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, డోన్ మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేశ్, బేతంచెర్ల మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి, మద్దిలేటి స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రామచంద్రుడు, డోన్ మున్సిపల్ వైస్ ఛైర్మన్లు జాకీర్ హుస్సేన్, వెంకట హరికిషన్, డోన్ వైసీపీ నాయకులు మల్లెంపల్లి రామచంద్రుడు, ప్యాపిలి జెడ్పీటీసీ శ్రీరాములు రెడ్డి, డోన్ మున్సిపల్ కౌన్సిలర్లు, దినేష్, ఉమామహేశ్వరి, డోన్ మున్సిపల్ కమిషనర్ జయరాం, డోన్ నియోజకవర్గ వాలంటీర్లు,తదితరులు పాల్గొన్నారు.

Thumbnailspm2

Thumbnailspm3

Comments

-Advertisement-