ఫరూక్ నగర్లో బీజేపీ ప్రజాపోరు యాత్రకు అపూర్వ స్పందన
ఫరూక్ నగర్లో బీజేపీ ప్రజాపోరు యాత్రకు అపూర్వ స్పందన
నంద్యాల, ఫిబ్రవరి 24 (పీపుల్స్ మోటివేషన్):-
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పుంధేశ్వరి, బిజెపి కేంద్ర ఆదిష్టానం పిలుపు మేరకు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆపార్టీ కన్వీనర్ అభిరుచి మధు అధ్వర్యంలో ప్రజా పోరు యాత్ర 4వ రోజుకు చేరుకుంది. శనివారం సాయంత్రం ప్రజాపోరు యాత్రలో భాగంగా అభిరుచి మధు పట్టణంలోని ఫరూక్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. ముస్లీం సోదరులు అత్యధిక సంఖ్యలో ఉన్నా ఫరూక్ నగర్లో బిజెపి కన్వీనర్ అభిరుచి మధుకు ఘన స్వాగతం లభించింది. ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని అభిరుచి మధు ప్రజలు వివరించారు. ఫరూక్ నగర్ లో ఇంటింటికీ తిరుగుతూ బిజెపి సాధించిన విజయాలను ఆయన వివరించారు. దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని అభిరుచి మధు ప్రజలకు స్పష్టం చేశారు. నంద్యాల ప్రాంతం శాంతికి, అభివృద్ధికి ప్రతీక అని ఆయన చెప్పారు. కానీ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి నేతలు నంద్యాల ప్రాంత అభివృద్ధికి ఏ మాత్రం శ్రద్ద చూపడం లేదని.. కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నంద్యాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని బిజెపి నేత అభిరుచి మధు ఆరోపించారు. నంద్యాలలో పేద ప్రజలు ఇంకా పేదరికంలోనే ఉన్నారని, కానీ గెలిచి అధికారంలో ఉన్న నేతలు మాత్రం కోట్లు కూడబెట్టుకుంటున్నరని ఆభిరుచి మధు విమర్శించారు. ఇటీవల వైసిపి అధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్రలో ఇండియా.. పాకిస్థాన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలకు శిల్ప మోహన్ రెడ్డి ఇంతవరకు సమాధానం చెప్పక పోవడంలో ఆంతర్యం ఏమిటని అభిరుచి మధు ప్రశ్నించారు. అభివృద్ధి అంటే కేంద్రం, అవినీతి అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే దుస్థితి రాష్ట్రం లో నెలకొందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, శిల్ప రవి ఆయన తండ్రి శిల్ప మోహన్ రెడ్డి సేవ ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారని అభిరుచి మధు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో దేశంలో , రాష్ట్రంలో బిజెపిని గెలిపించాలని అభిరుచి మధు పిలుపు ఇచ్చారు.
అంతకుముందు, శనివారం ఉదయం పట్టణంలోని బంగారు అంగల్ల వీధి, పెడ్డబండ, జంబుల పరమేశ్వరి ఆలయం తదితర ప్రాంతాల్లో అభిరుచి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కషెట్టి చంద్ర శేఖర్, మహిళ నేతలు స్వాతి, ఉపేంద్ర, బాలన్న, తదితరులు పాల్గొన్నారు.