రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నలుగురు దొంగల పట్టివేత... స్వాధీనం చేసుకున్న వాహనాలు

police news, anantapur news, ap police news,
Peoples Motivation

నలుగురు దొంగల పట్టివేత... స్వాధీనం చేసుకున్న వాహనాలు 

వీరిని వేర్వేరుగా అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు 

వీరితో పాటు ఉన్న ఇద్దరు మైనర్లను జె.జే.బోర్డు ముందు హాజరు పరిచిన పోలీసులు

వీరందరి నుండీ 29 ద్విచక్ర వాహనాలు, ట్రాలీతో కూడిన ట్రాక్టర్ స్వాధీనం

వాహనాల మొత్తం విలువ రూ. 25 లక్షలు ఉంటుంది

జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ IPS ఈరోజు మీడియాకు వివరాలు వెల్లడించారు.

అనంతపురం సిసిఎస్ & టూటౌన్ పోలీసులు అరెస్టు, స్వాధీనం చేసుకున్న వారి వివరాలు...

నిందితుల అరెస్టు వివరాలు 

1) నరేష్, వయస్సు 21 సం., నాల్గవ రోడ్డు, అనంతపురం

2) మహేంద్ర, వయస్సు 21 సం., తిరుమల డైరీ సమీపం, ఫంగల్ రోడ్డు, రాప్తాడు

3) నాని కుమార్, వయస్సు 21 సం., ఇటుకలపల్లి గ్రామం, అనంతపురం

 వీరితో పాటు ఇద్దరు మైనర్లను జె.జె.బోర్డు ముందు హాజరు పరిచారు.

24 ద్విచక్ర వాహనాలు, ట్రాలీతో కూడిన ట్రాక్టర్ ( వీటి విలువ రూ. 21 లక్షలు ఉంటుంది ) అని తెలిపారు.

  అరెస్టయిన ముగ్గురు నిందితులు మరియు ఇద్దరు మైనర్లు మంచి స్నేహితులు. వీరికి తాగుడు, తదితర వ్యసనాల అలవాట్లు ఉన్నాయి. జల్సాలకు బానిసలైన వీరు వాహనాల చోరీలకు పాల్పడుతూ వచ్చారు. ఈ ఐదుగురు కలసి ఇతర ప్రాంతాలతో పాటు స్థానిక ఆర్టీసీ బస్టాండు, జిల్లా సర్వజన ఆసుపత్రి, తదితర రద్దీ ప్రాంతాలకు వెళ్లడం... అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేస్తారు. ద్విచక్ర వాహనం పార్క్ చేసిన వ్యక్తిని అనుసరించడం, చుట్టూ పరిస్థితులను పరిశీలించడం, అనువైన సమయంలో నకిలీ తాళాల సహాయంతో ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్తారు. ఇలా దొంగలించిన వాహనాలను నరేష్ తక్కువ ధరకే విక్రయించి వచ్చిన సొమ్మును అందరూ జల్సాలకు వినియోగించారు. గత ఏడాదిన్నర కాలంలో అనంతపురం టు టౌన్ , త్రీ టౌన్, తాడిపత్రి, ధర్మవరం, బత్తలపల్లి, కర్నాటక రాష్ట్రం బళ్లారి, సింధనూరు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేశారు. వీటితో పాటు నాలుగు రోజుల కిందట నల్లచెర్వు మండల కేంద్రంలో ట్రాలీతో కూడిన ట్రాక్టర్ ను దొంగలించి కళ్యాణదుర్గంలో తక్కువ ధరకే విక్రయించారు. వాహనాల దొంగతనాల కోసం ఎక్కడికి వెళ్లాలనుకున్నా వీరు అద్దె కారును ఉపయోగించారు. అని తెలిపారు.

జిల్లా దొంగలపై నిఘా వేయండి...

జిల్లాలో దొంగలపై నిఘా వేయాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో అనంతపురం సిసిఎస్ & టూటౌన్ సి.ఐ లు ఇస్మాయిల్, వెంకటేష్ నాయక్, జనార్ధన్, క్రాంతికుమార్ ... ఎస్సై శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ బయ్యన్న, శ్రీనివాస్, తిరుమలేష్, కానిస్టేబుళ్లు రంజిత్, శ్రీధర్ ఫణి, వన్నూరు, దాస్ , ఆసిఫ్ లు ప్రత్యేక బృందంగా ఏర్పడి రాబడిన సమాచారంతో వీరిని ఫంగల్ రోడ్డు సమీపంలో ఈరోజు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఈ పోలీసు బృందాలను అభినందించారు. 


కళ్యాణదుర్గం అర్బన్ పోలీసు వారు చేసిన అరెస్టు, స్వాధీనం వివరాలు ...

ఒకరు అరెస్టు... 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం ( వీటి విలువ రూ. 4 లక్షలు ఉంటుంది )

కళ్యాణదుర్గం అర్బన్ పోలీసులు ఒకర్ని అరెస్టు చేసి 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అప్పులు తీర్చుకునేందుకు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడి ఆదిలోనే పోలీసులకు చిక్కాడు. అరెస్టయిన నిందితుడి వివరాలు పరిశీలిస్తే 

పోతుల జాన్, వయస్సు 28 సం., చంద్రబాబునగర్, రుద్రంపేట, అనంతపురం. ఇతను తన ఇంటి ఖర్చులు, కుటుంబ పోషణ కోసం అప్పులు చేసుకున్నాడు. వారి నుండీ ఒత్తిళ్లు అధికం కావడంతో ఎలాగైనా అప్పులు తీర్చాలని భావించి ద్విచక్ర వాహనాల దొంగతనాలు మొదలు పెట్ఠాడు. ఐదు రకాల కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాల నకిలీ తాళాలను సేకరించుకున్నాడు. ట్యుబెక్టమీ ఆపరేషన్లు కోసం కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి జనం విరివిగా వస్తారని... ఆసుపత్రి ముందు చాలా ద్విచక్ర వాహనాలు పార్క్ చేసి ఉంటారని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. నకిలీ తాళాల సహాయంతో గత రెండు నెలల నుండీ 5 ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడ్డాడు. 

       కళ్యాణదుర్గం పట్టణం బళ్లారి రోడ్డులోని ఆర్డీటీ ఆసుపత్రి, పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల చోరీలు తరుచూ జరుగుతుండటంపై ప్రత్యేక నిఘా వేయాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసుల పర్యవేక్షణలో అర్బన్ సి.ఐ హరినాథ్ మరియు సిబ్బంది ఏఎస్సై ఖాదర్ బాషా, కానిస్టేబుళ్లు గంగాధర, సురేంద్ర, హనుమంతరాయుడు, మహేష్ లు బృందంగా ఏర్పడి ద్విచక్ర వాహనాల చోరీలపై నిఘా వేశారు. పక్కా రాబడిన సమాచారం మేరకు అనంతపురము బైపాస్ రోడ్డులోని మారుతి వేబ్రిడ్జి వద్ద ఈ నిందితుడిని అరెస్టు చేశారు. సి.ఐ హరినాథ్ బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

Comments

-Advertisement-