ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి భూమి పూజ
PRESS CLUB NEWS, AP NEWS, NANDYAL NEWS, DHONE PRESS CLUB NEWS
By
Peoples Motivation
ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి భూమి పూజ
డోన్ : ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లా డోన్ పట్టణం లో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి పాత బస్టాండ్ లో స్థలం కేటాయించి భూమి పూజకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన డోన్ మున్సిపాలిటీ చైర్మన్ సప్తశైల రాజేష్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న జర్నలిస్టు ప్రెస్ క్లబ్ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించిన సందర్భంగా చైర్మన్ సప్తశైల రాజేష్ ను శాలువా పూలమాలలతో సత్కరించారు. చైర్మన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్ని విధాల వైసిపి ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. పాత్రికేయులు అందరూ సప్తశైల రాజేష్ ను కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మహేశ్వర్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి పాత్రికేయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments