విద్యార్థుల్లో నైతిక విలువలు కలిగి ఉన్నాయా....?
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది ఎవరూ..?
విద్యార్థులలో మానవతా విలువలు మర్చిపోవాల్సిందేనా...?
విద్యార్థుల్లో నైతిక విలువలు కలిగి ఉన్నాయా....?
విద్యార్థులకు సామాజిక బాధ్యత ఉందా....?
ప్రభుత్వమా......?
ఉపాధ్యాయులా..?
తల్లిదండ్రులా......?
విద్యార్థుల సామాజిక అవగాహన లోపం వల్ల ఇటు సమాజంపై అటు రక్త సంబంధాలపై ఏ మాత్రం అవగాహన లేకుండా ఇలా ప్రవర్తించాలో తెలియని అయోమయం స్థితిలో ఉన్న ఇప్పటి ఈ జనరేషన్ విద్యార్థులను చూస్తుంటే కొంతకాలం తర్వాత రక్త సంబంధాలు అనేవి క్రమానుసారంగా అంతరించి పోతాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం ఇప్పటి చదువుకుంటున్న విద్యార్థుల లోకం. ఇప్పటి చదువుకుంటున్న విద్యార్థులలో నీతి నియమాలతో కూడిన మానవతా విలువలు కలిగిన సామాజిక స్పృహను, పెద్దలను గౌరవించడం, చిన్నవారితోనే స్నేహపూర్వకంగా ఉండటం, కలిగించే విద్యను అందించాలి. యువత అత్యధికంగా కలిగి ఉన్న దేశం మన దేశమే కాబట్టి యువత అత్యంత శక్తిగా ఎదగాలంటే తప్పనిసరిగా క్రమశిక్షణ అవసరం. అప్పుడే నా దేశం గొప్ప దేశంగా గర్వంగా చెప్పగలుగుతాము. అప్పుడు అన్ని రంగాల్లో భారతదేశం మొట్టమొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది.
విద్యార్థులకు మానవతా విలువలు కలిగి ఉన్నాయా..?
అనేదానికి ముక్కు సూటిగా చెప్పాలంటే ఈ యొక్క సమాజంలో ఏ ఒక్క విద్యార్థికి మానవత విలువలు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి దూకుడు తనం, స్వార్థం, ఎదుటివారిని చులకనగా చూడటం, పెద్దలను మర్యాదపూర్వకంగా గౌరవించకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య ఉన్న సత్సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని చెప్పవచ్చు.
ఈ రోజుల్లో 5జి స్పీడ్ తో దూసుకుపోతున్న దేశంలో ఇంటర్నెట్ ను ఉపయోగించుకుంటూ విద్యార్థులు తమ భవిష్యత్తుకు మంచి మార్గాల్లో అనేకమైన ఓ ఒత్తిళ్ళ లోగిళ్ళలో ఎన్నో తప్పటడుగులు వేస్తూ తమ ప్రాణాలనే ప్రాణంగా పెడుతున్నారు. అనేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా సామాజిక స్పృహ తోటి వారితో ఎలా మెరుగాలి అని తెలుసుకుంటే అన్ని తనంతట తానే నేర్చుకోగలుగుతాడు. సమాజానికి ఒక కేంద్రబిందువుగా ఒక వ్యక్తి నుండి శక్తిగా ఎదుగుతాడు అనడంలో ఎంతోమంది ఉదాహరణలు ఉన్నాయి .
విద్యార్థుల్లో నైతిక విలువలు ఉన్నాయా అనే అంశంపై మాట్లాడాలంటే ఈ రోజుల్లో నైతిక విలువలు పూర్తిగా సన్న గిల్లుతున్నాయి అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి విద్యార్థికి ఒక స్మార్ట్ ఫోన్ తప్పనిసరి వస్తువు అయిపోయింది. విద్యార్థులు తమ స్మార్ట్ ఫోన్లలో అశ్లీలదృశ్యాలు చూస్తూ, మత్తు పానీయాలకు బానిసలు అవుతూ, సోమరులుగా పనిచేతకాక ,ఏ పని చేయాలో తోచక ఎంతో మంది విద్యార్థులు రోడ్లమీద దర్శనమిస్తున్నారు. మరి ఇలాంటి విద్యార్థులకు మార్గదర్శకాలు చూపాల్సింది ఎవరు...!.?
విద్యార్థుల్లో అసలు సమాజం మీద అవగాహన లేకపోవడం. చాలా దురదృష్టకరం. . !
ఇంతసేపు విద్యార్థులు తమ స్వార్థం కోసమే తప్ప, సామాజిక కోసం పట్టించుకునే సమయము, తీరిక అసలు లేదంటే ఎంత సామాజిక అవగాహన ఉందో అర్థమవుతుంది.విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సింది ఎవరు. ...! విద్యార్థుల చక్కని బంగారు భవిష్యత్తును అందాకారం చేస్తుంది ముమ్మాటికి తల్లిదండ్రుల పెంపకమే...!
ఎందుకంటే తల్లిదండ్రులు తమబిడ్డలను అల్లారుముద్దుగా, ఏ కష్టం బాధ తెలియనీయకుండా, బాధ్యత రహితంగా పెంచుతున్నారో మన కళ్ళ ముందు ఎన్నో దర్శనాలు చేస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం రాత్రి బవల్లు కష్టపడతారు కానీ పిల్లల యొక్క మంచి చెడులు అరచుకోవడానికి తీరిక ఉండదు. కాబట్టి పిల్లలకు ఎటువంటి కట్టుబాట్లు చెప్పకుండా వాళ్లను ఇష్టానుసారంగా పెంచడం వల్ల చివరికి ఏమవుతాడో..?
ఎలా పెరుగుతాడో.....?
సమాజానికి ఎలాంటి పని చేస్తాడో. ..?
ఎలాంటి సమస్య తెస్తాడో..?. తెలియని పరిస్థితి..! తల్లిదండ్రులు ఇప్పటికైనా మారి తమ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ సమాజ శ్రేయస్సుకోసం ఎంతైనా ఉంది. ఇలాంటి పిల్లలను ఉపాధ్యాయులు , గుర్తించి విద్యార్థుల యొక్క శైలిలో మార్పు వచ్చే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సరైన మార్గనిర్దేశకాలు చేస్తూ, అతనికి దిశా నిర్దేశించడంలో ఒక ఒక మంచి విద్యార్థిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయునిపై ఎంతైనా ఉంది . ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఇలాంటి విద్యార్థులకు చొరవ తీసుకొని ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మానసికంగా ఒత్తిళ్లకు గురైన వాళ్లకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇప్పించి తగిన శ్రద్ధ చూపించాలి. విద్యార్థులను మత్తు పానీయాలు నుండి అశ్లీల ప్రపంచం నుండి మెల్లమెల్లగా దూరం చేస్తూ,విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికితీయటంలో ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు.