ప్రెస్ క్లబ్ భవనం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తాం
ప్రెస్ క్లబ్ భవనం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తాం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే పెబ్బేరు ప్రెస్ క్లబ్ కు గొప్ప చరిత్ర
ప్రెస్ క్లబ్ చిన్నగా ఉన్నందున దీనిని విస్తరించాల్సిన అవసరం ఉంది
-వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి ఫిబ్రవరి 06 ( పీపుల్స్ మోటివేషన్ ):-
పెబ్బేరు ప్రెస్ క్లబ్ పునరుద్ధరణకు కృషి చేస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హామి ఇవ్వడం జరిగింది.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే పెబ్బేరు ప్రెస్ క్లబ్ కు గొప్ప చరిత్ర ఉందని ఆయన పేర్కొన్నారు.నూతనంగా ఎంపికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.పెబ్బేరు పట్టణంలో ఏటా జరిగే చౌడేశ్వరి జాతర ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన ఎమ్మల్యే ప్రత్యేక చొరవ తీసుకొని అదేవిధంగా పెబ్బేరు ప్రెస్ క్లబ్ ను ఆయన సందర్శించారు.ప్రెస్ క్లబ్ కు మొదటిసారి వచ్చిన సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు బాలవర్ధన్,ప్రధాన కార్యదర్శి పరుశరాముడు,కోశాధికారి రమేష్, ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ,కిరణ్ కుమార్, తదితర సభ్యులు ఎమ్మల్యే మేఘారెడ్డిని పూలమాల,శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏళ్ల చరిత్ర ఉన్న పెబ్బేరు ప్రెస్ క్లబ్ భవనం శిథిలావస్థకు చేరిందని,ప్రెస్ క్లబ్ ను బాగు చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.అందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.భవనం చిన్నగా ఉన్నందున దీనిని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. సీడీఎఫ్ నిధుల నుంచి భవనం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామి ఇవ్వడం జరిగింది.