ఖాకీ సినిమాను తలపిస్తున్న పార్థి గ్యాంగ్ దొంగతనాలు..
ఖాకీ సినిమాను తలపిస్తున్న పార్థి గ్యాంగ్ దొంగతనాలు..
హైవేలపై జరిగుతున్న రాబరీలపై నిఘా వేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ

అనంతపురం, ఫిబ్రవరి 12 (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీ, కర్నాటక, మహారాష్ట్రాలలోని పెట్రోల్ బంకుల్లో రాబరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పార్థి గ్యాంగ్ ఐదుగురు..ఈ గ్యాంగ్రి కు సమాచారాన్ని చేరవేసే ముగ్గురు కలిపి మొత్తం 8 మందిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం రూ. 35 లక్షలు విలువ గల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్థి గ్యాంగ్ పై ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో పలు రాబరీలు... కేసులు నమోదయ్యాయి.
ఈ గ్యాంగ్ శివారు ప్రాంతాల్లోని పెట్రోలు బంకులే టార్గెట్ చేసి సిబ్బంది గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి దాటాక పెట్రోలు దొంగతనాలు, టైర్ల స్టాక్ గోడౌన్లలో దొంగతనాలు చేయడం. పెట్రోల్ బంకుల్లో సిబ్బంది మేల్కొని ఉంటే చంపుతామని మారణాయుధాలతో బెదిరించి రాబరీలు చేయడం వీరి పని. రెండు లారీలు అద్దెకు తీసుకొచ్చి రాబరీలు, దొంగతనాలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్.
పార్థి గ్యాంగు ముఠాకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ మీడియాకు వెల్లడించారు.
అరెస్టు చేసిన ప్రార్ది గ్యాంగ్ సభ్యుల వివరాలు:
👉పేరు శివ అప్ప పవర్, వయస్సు 21 సం., రనర్ బావి గ్రామం, వసి తాలుక్, ఉస్మానాబాద్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్ర.
ఈ గ్యాంగ్ లో ఇతను కీలకమైన వాడు. గతంలో ఇతను తమిళనాడులోని శివకాశీలో టపాసుల ఫ్యాక్టరీ లో కూలి పని చేసేవాడు( 4 వ నిందితుడికి అన్న అవుతాడు).
👉పేరు బాలాజీ దత్తాత్రినాయక్ వాడి, ఇతని వయస్సు 40 సం., రనర్ బావి గ్రామం, వసి తాలుక్, ఉస్మానాబాద్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్ర. (వృత్తిరీత్యా ఇతను డ్రైవర్ )
👉పేరు బాబానందు షిండే, ఇతని వయస్సు 21 సం., కంకర్ వాడి గ్రామం, వసి తాలుక్, ఉస్మానాబాద్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం. ఇతను కూడా గతంలో టపాసుల ఫ్యాక్టరీ లో కూలి పని చేసేవాడు. (4వ నిందితుడి చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడు.)
👉పేరు మాదేవ్ సురేశ్ పవర్, ఇతని వయస్సు 20 సం., టెర్ణ కాలేజ్, ఉస్మానాబాద్, మహారాష్ట్ర రాష్ట్రం. ఇతను కూడా గతంలో టపాసుల ఫ్యాక్టరీ లో కూలి పని చేసే వాడు( మొదటి నిందితుడికి ఇతను తమ్ముడు అవుతాడు)
👉పేరు అశోక్ ధర్మ జాదేవ్ (కాకా),ఇతని వయస్సు 55 సం., ఉమ్ర గ్రామం, కల్లం తాలుక్, ఉస్మానాబాద్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్ర. వృత్తిరీత్యా ఇతను డ్రైవర్
రిసీవర్లు:
👉పేరు గడ్డం గాంగేశ్వర, ఇతను వయసు 28 సం., వేమలపాడు గ్రామం, యాడికి మండలం, అనంతపురం జిల్లా
👉 పేరు గడ్డం నాగేష్, ఇతని వయస్సు 41 సం., వేమలపాడు గ్రామం, యాడికి మండలం, అనంతపురం జిల్లా
👉 పేరు కడవకల్లు జగదీష్, ఇతని వయస్సు 40 సం., వేమలపాడు గ్రామం, యాడికి మండలం, అనంతపురం జిల్లా
వీళ్ళ నేపథ్యం:
ఈ ముఠాలోని సభ్యులందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు. వీళ్లలో అధికంగా సమీప బంధువులే ఉండటం గమనార్హం. కూలీ పనులు, డ్రైవర్ వృత్తి వల్ల వచ్చే సంపాదనతో తృప్తి పడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాలకు ఒడిగట్టారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని పెట్రోలు బంకులు, టైర్ల స్టాక్ గోడౌన్లను టార్గెట్ చేస్తారు.ఒక నెల లేదా 20 రోజులకని బాడుగకు మాట్లాడుకుని 12 వీలర్ల లారీలను రెండింటిని ఉస్మానాబాద్ ప్రాంతంలో అద్దెకు తీసుకుని రాబరీలు, దొంగతనాలు చేసేందుకు మహారాష్ట్రతో పాటు కర్నాటక మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వస్తారు. ఈ లారీలతో పాటు డీజిల్ తోడేందుకు 2 చేతి పంపులు, డీజిల్ క్యాన్లు, వందల మీటర్లు గల పైపు కట్టలు వెంట తీసుకొస్తారు.
శివారు ప్రాంతాలలోని పెట్రోలు బంకులే టార్గెట్ ...
ఈ ముఠా సభ్యులు వ్యూహాత్మకంగా పథకం ప్రకారం రాబరీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల శివారు ప్రాంతాలలో ఉన్న పెట్రోల్ బంకులను టార్గెట్ చేసుకుంటారు. వంద లేదా రెండు వందల మీటర్ల దూరంలో లారీలను ఉంచడం... ముఠా సభ్యులు అర్ధరాత్రి 12:30 గంటలు- 2 గంటల మధ్యలో పెట్రోలు బంకు వద్దకు చేరుకుంటారు. ఆ సిబ్బంది గాఢ నిద్రలో ఉంటే డీజిల్ దొంగతనాలకు ఒడిగడతారు. పెంట్రోలు బంకులో నేల కింద అమర్చిన డీజిల్ ట్యాంక్ లాక్ పగులగొట్టడం... వెంట తెచ్చుకున్న పైపును ఆ ట్యాంకులో వదలి చేతి పంపుల ద్వారా డీజిల్ లాగేసి క్యాన్లు నింపుకుంటారు. ఇలా... ఒక్కో బంకులో 2 వేల లుటర్ల వరకు సులువుగా తోడేసుకుని పరారవుతారు. దొంగలించిన డీజిల్ ను తక్కువ ధరలకు హైవేల సమీపంలో లూజ్ విక్రయాలు సాగిస్తున్న వారికి మరియు సుదూర ప్రాంతాలకు వెళ్లే ఇతర రాష్ట్రాల లారీ డ్రైవర్లకు విక్రయిస్తారు. దొంగ డీజిల్ కొన్న యాడికి ప్రాంతానికి చెందిన రిసీవర్లను పోలీసులు పట్టుకున్నారు.
పెట్రోలు బంకు సిబ్బంది నిద్రలో కాకుండా మేల్కొని ఉంటే చంపుతామని బెదిరించి వారి వద్దనున్న నగదును ఎత్తుకెళ్తారు. అంతేకాకుండా మహారాష్ట్ర, తదితర ప్రాంతాలలోని పట్టణ శివార్లలో ఉన్న టైర్ల గోడౌన్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఒక లారీలో దొంగలించిన డీజిల్ ను క్యాన్లలో నింపి ఉంచడానికి... ఇంకొకటి టైర్ల గోడౌన్లలో దొంగలించిన వస్తువులు తరలించేందుకు ఉపయోగించారు.
జిల్లాలో ఈ ముఠా పెట్రోలు బంకుల్లో చేసిన రాబరీలు
రాప్తాడు శివార్లలోని పెట్రోల్ బంకులో చంపుతామని బెదిరించి 20-December-2023 తేదీన రూ. 28,000-00 నగదు ఎత్తుకెళ్లారు.
కూడేరు పెట్రోల్ బంకులో సిబ్బందిని చంపుతామని బెదిరించి 15-Decembee-2023 తేదీన రూ. 28,000-00 నగదు రాబరీ చేశారు.
శ్రీసత్యసాయి జిల్లాలోని బత్తలపల్లిలో పెట్రోల్ బంకులో 02-ఫిబ్రవరి-2024 తేదీన 1924 లీటర్ల డీజిల్ దొంగతనం చేశారు
శ్రీసత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లి శివార్లలోని పెట్రోలు బంకులో 03-02-24 తేదీన 1631 లీటర్ల డీజల్ చోరీ చేశారు
అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ పెట్రోలు బంకులో 06-02-24 తేదీన... 1230 లీటర్ల డీజల్ దొంగతనం చేశారు.
ఈ నేరాలతో పాటు కర్నాటకలోని బెంగుళూరు, జవర్గి, మహారాష్ట్రలోని షోలాపుర్ , ఒమెర్గా ప్రాంతాలలోని రాబరీలు మరియు టైర్ల స్టాక్ గోడౌన్లలో దొంగతనాలు చేశారు.
హైవేలపై జరిగుతున్న దొంగతనాల పై నిఘా పెంచాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ
జిల్లాలోని హైవేలపై జరుగుతున్న రాబరీలు, దొంగతనాలపై ప్రత్యేక నిఘా వేయాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం సిసిఎస్ సి.ఐ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
అరెస్టు ఇలా చేశారు : మూడు రాష్ట్రాలలో పలు రాబరీలు, దొంగతనాలు చేసిన అంతర్రాష్ట్ర పార్థి గ్యాంగు జిల్లాలో సంచరిస్తోందన్న సమాచారంతో సి.ఐలు ఇస్మాయిల్, జనార్ధన్, సిబ్బంది రంజిత్, బాలకృష్ణ, దాస్, ఆసిఫ్, యాసర్, మనోహర్ లు బృందంగా ఏర్పడి పక్కా సమాచారంతో ఈరోజు ఎస్కేయూనివర్శిటీ సమీపంలోని శివారు ప్రాంతంలో ఈ గ్యాంగును పట్టుకున్నారు. ఇంకా ఈ గ్యాంగులోని కీలక సభ్యులు పట్టుబడాల్సి ఉంది.
జిల్లా ఎస్పీ ప్రశంసించారు : ఆంధ్ర, మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో పలు రాబరీలు, దొంగతనాలు చేసిన అంతర్రాష్ట్ర పార్థి గ్యాంగును చాకచక్యంగా పట్టుకున్న సిసిఎస్ సి.ఐ లు ఇస్మాయిల్, జనార్ధన్ ,సిబ్బంది రంజిత్, బాలకృష్ణ, దాస్, ఆసిఫ్, యాసర్, మనోహర్ ల బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.