ఉమ్మడి జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు పోలీసులు తో రివ్యూ మీటింగ్
పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు పోలీసుల మధ్య కోఆర్డినేషన్ పై రివ్యూ మీటింగ్ ఏర్పాటు...
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ V. యెహెజ్కేల్
నంద్యాల, ఫిబ్రవరి 03 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ నందు గల ఫంక్షన్ హాల్ లో కర్నూలు, నంద్యాల జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు పోలీసులు తో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ జె.సుదర్శన్ రెడ్డి మరియు గెస్ట్ ఆఫ్ హానర్ గా జిల్లా ఎస్పీ K. రఘువీర్ రెడ్డి IPS హాజరు కావడం జరిగింది.
ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం క్రిమినల్ కేసులలో పోలీస్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ల మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే అంశంపై చర్చ జరిగింది మరియు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించాలని కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించాలని వివరించడం జరిగింది. అంతేకాక 2024 సంవత్సరానికి సంబంధించి ప్రాసిక్యూషన్స్ డైరీ ని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ J. సుదర్శన్ రెడ్డి మరియు జిల్లా ఎస్పీ K. రఘువీర్ రెడ్డి ఐపీఎస్ తో పాటు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ V. యెహెజ్కేల్ కర్నూలు, నంద్యాల జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు నంద్యాల జిల్లా పోలీసులు పాల్గొన్నారు.