రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలలో హర్షద్ బాషా, హాసిని

sports news, national level basketball news, ap basketball team news, kurnool sports news
Peoples Motivation

కర్నూల్ స్పోర్ట్స్ న్యూస్, ఫిబ్రవరి 02 (పీపుల్స్ మోటివేషన్):-


8వ రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలు నూజివీడు, ఏలూరు జిల్లాలో 2023 జూన్ నెల 28' 29 '30. తేదీలలో  మన కర్నూలు జిల్లా తరఫున బాలుర విభాగంలో ఎస్కే హర్షద్ భాష అదే విధంగా అమ్మాయిల విభాగంలో కే.హాసిని అత్యుత్తమ ఆట ప్రదర్శన చేశారు. జిల్లా గెలుపుకు చాలా కృషి చేశారు. వీరి ఇరుగురు 2024 జనవరి  19వ తేదీ నుండి ఫిబ్రవరి రెండవ తారీకు వరకు జరిగే బాస్కెట్బాల్ అండర్ 18 జూనియర్స్ విభాగంలో జాతీయస్థాయి కోచింగ్ క్యాంపులో సెలెక్ట్ అయ్యి మరియు మన ఆంధ్ర రాష్ట్ర జట్టు తరుపున ఈనెల నాలుగో తారీఖు నుండి 11వ తారీకు వరకు ఒడిస్సా, భువనేశ్వర్ లో జరగబోయే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనందుకు మన కర్నూలు జిల్లా బాస్కెట్బాల్ సెక్రటరీ భాను ప్రసాద్ మరియు ప్రెసిడెంట్ నీలిమ క్రీడాకారులను అభినందించారు. వీరు రాబోయే రోజులలో అత్యుత్తమ ఆటా నైపుణ్యాలతో మన జిల్లాను ప్రథమ స్థానంలో నడపవలసిందిగా కోరారు. ఈ అభినందన సభలో సంఘం యొక్క సభ్యులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-