జంటహత్యల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష...జిల్లా కోర్టు సంచలన తీర్పు..
జంటహత్యల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష...జిల్లా కోర్టు సంచలన తీర్పు..
భార్యను అత్తను హత్య చేసిన కేసులో శ్రవణ్ కుమార్ కు ఉరిశిక్ష
జంటహత్యల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష
కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు..
కర్నూలు, ఫిబ్రవరి 21 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు జిల్లా న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు. భార్యను, అత్తను హత్య చేసిన కేసులో శ్రవణ్ కుమార్ కు ఉరిశిక్ష విధించారు. జంట హత్యల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదును విధిస్తూ కర్నూలు జిల్లా అదనపు జడ్జి తీర్పు చెప్పారు. శ్రవణ్ కుమార్ కు హత్య చేయడానికి సహకరించిన తండ్రి వరప్రసాద్ కు ఉరిశిక్ష, తల్లి కృష్ణవేణికి యావజ్జీవం విధిస్తూ తీర్పు చెప్పింది.
ఏడాదిలోపే విచారణ... ముగించి ఈ సంచలన తీర్పు చెప్పారు. గత ఏడాది మార్చిలో ఈ జంట హత్యలు కర్నూలు జిల్లాలో సంచలనం కలిగించాయి. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యపై అనుమానంతో భర్త శ్రవణ్ కుమార్ తన తల్లి, తండ్రి సహకారంతో అత్త, భార్యలను చంపేశారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసక్యూటర్ వై. ప్రకాష్ రెడ్డి కేసును వాదించగా కర్నూల్ నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రతిభదేవి ఈ సంచలన తీర్పు చెప్పారు. గత ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఇలాంటి తీర్పు వెలువడడం మొదటిసారి.