దశాబ్ద కాలంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు...
దశాబ్ద కాలంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు...ప్రజా పోరులో బిజెపి నాయకులు
డోన్, ఫిబ్రవరి 27 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం " కొచ్చెర్వు"లో ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించిన డోన్ బిజెపి నాయకులు...
భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి 2024 మధ్య కాలంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అందులో భాగంగానే ప్రజల వద్దకు పాలన లాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు తెలిసే విధంగా మరియు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంతో వికసిత భారత్ సంకల్పము 2047 నాటికి సాధించే దిశగా గ్రామాలన్ని సంపూర్ణ ఆధునిక భారతం వలె అభివృద్ది సాధించాలని ప్రజా పోరు కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు మరియు నంద్యాల జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ బైరెడ్డి శబరి సూచనలతో ఫిబ్రవరి 21 నుండి 29 వరకు ప్రజా పోరు కార్యక్రమంను రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే నంద్యాల జిల్లాలోని ప్రతి అసెంబ్లీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే... డోన్ నియోజకవర్గంలో డోన్ లో కొచ్చెర్వు గ్రామంలో, అబ్బిరెడ్డి పల్లి మరియు రేకులకుంట గ్రామంలో ప్రజా పోరు కార్యక్రమాన్ని డోన్ అసెంబ్లీ కన్వీనర్ సందు వెంకట రమణ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి బిజెపి చేరువ అవ్వాలనే లక్ష్యంతో ముఖ్య కూడలిలో పాటు, ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రధాని మోడీ సంక్షేమ కేలండర్ పంపిణీను డోన్ బిజెపి సీనియర్ నాయకులు అసెంబ్లీ కన్వీనర్ సందు వెంకట రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్, రూరల్ మండలం అధ్యక్షులు రవికుమార్, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ,ప్రధాన కార్యదర్శి అశోక్, బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున, శివ, మహేష్ పంపిణీ చేయడం జరిగింది.అదేవిధంగా ఈ ప్రజా పోరు కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు,ఇతర బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.