అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్...చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్...
పరారీలో మరొక నిందితుడు -చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
దొంగలించబడిన సొత్తు రికవరీ -వివరాలు వెల్లడించిన డిఎస్పీ వెంకట రామయ్య
శిరివెళ్ల ఫిబ్రవరి 08 (పీపుల్స్ మోటివేషన్ న్యూస్):-
శిరివెళ్ల మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో పల్లపు నాగాంజనేయులు ఇంటిలో దొంగతనానికి పాల్పడిన దొంగను పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఈ మేరకు శిరివెళ్ల సర్కిల్ కార్యాలయంలో ఆళ్లగడ్డ డిఎస్పీ వెంకటరామయ్య, సీఐ వంశీధర్, ఎస్సై సురేష్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. మొదటి ముద్దాయి సంపంగి శ్రీరాములు పలుకూరు గ్రామం, బనగానపల్లె మండలం, రెండో ముద్దాయి సుబ్రమణ్యం, యనకండ్ల గ్రామము, బనగానపల్లె మండలం అని చెప్పారు. రెండో ముద్దాయి నేరస్థలం నుంచి పారిపోయినాడన్నారు.
ముద్దాయి నుండి రెండు బంగారు చైన్ లు, మూడు బంగారు ఉంగరాలు, ఒక జత బంగారు బుట్ట కమ్మలు, ఒక బంగారు ముక్కు పుడక, ఒక జత చిన్న మాటీలు, సుమారు 15 తులాల వెండి కాళ్ళ పట్టీలు, రూ.15 వేలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మొత్తం దొంగలించిన వస్తువుల విలువ రూ.1,70,000గా ఉందన్నారు. వీటిని ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలానే జలదుర్గం కేసులో దొంగతనం చేసిన కేసులో సుమారు రెండు తులాల బరువు గల బంగారు చైన్, ఒక జత బంగారు కమ్మలు, 23 తులాలు గల జత వెండి పట్టీలు ఉన్నాయన్నారు.
ఈ సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మొదటి ముద్దాయి గతంలో ఇళ్ళలోనూ, దేవాలయాలలో దొంగతనం చేయగా అతనిపై గతంలో కర్నూలు, ఓర్వకల్, తుని, అచ్చంపేట (తెలంగాణ రాష్ట్రం), కనిగిరి, బేతంచర్ల, నందివర్గం, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ల పరిధిలో మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. మొదటి ముద్దాయి పై నందివర్గం పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఉందన్నారు. ఇతనిపై నందివర్గం మరియు బేతంచర్ల పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్ బీడబ్ల్యు) పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ లోనే గాక తెలంగాణ లో కూడా పై ముద్దాయిలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. ఇద్దరూ ముద్దాయిలపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు. చాక చక్యంగా కేసును ఛేదించిన సీఐ వంశీధర్ ఎస్సై సురేష్, సిరివెళ్ల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి, నగేష్, బాలసుబ్బయ్య, ప్రసన్న, శేషు,శ్రీను,నాగేంద్రలను కేసును చేదించిన పోలీసులను డిఎస్పీ అభినందించారు.