రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హైటెక్ పద్ధతిలో సాగుతున్న అరాచకానికి ముగింపు పలుకుతా...

Anantapur Dist News? Paritala Sriram news? Paritala Sriram mla? Paritala Suneetha mla? Paritala Sriram mla dharmavaram?paritala family biography?
Peoples Motivation

హైటెక్ పద్ధతిలో సాగుతున్న అరాచకానికి ముగింపు పలుకుతా...

బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి

ఇక ఉన్నది ఒక్క నెల రోజులు మాత్రమే.. అప్పుడు ఏమవుతుందో ఆలోచించుకోండి

జగన్ కోడిని మాత్రమే మింగుతాడు.. కేతిరెడ్డి అంతకుమించి

ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తీవ్ర వ్యాఖ్యలు

17వ వార్డులో వైసిపి నుంచి టిడిపిలోకి భారీగా చేరికలు

Thumbnails pm news

ధర్మవరం, ఫిబ్రవరి 23 (పీపుల్స్ మోటివేషన్):-

గతంలో ధర్మవరంలో అరాచకాలు అన్ని ప్రత్యక్షంగా కనిపించేవని.. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కేతిరెడ్డి హయంలో హైటెక్ పద్ధతిలో అరాచకాలు సాగుతున్నాయని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం పట్టణంలో వైసీపీకి వరుసగా షాక్ మీద షాక్ తగులుతోంది. వైసిపి నాయకులు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ తమ మద్దతును ప్రకటిస్తున్నారు. తాజాగా 17వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ బండి నారాయణస్వామి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నారాయణస్వామి, రాము తో పాటు 50 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. 17వ వార్డులో ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరిటాల శ్రీరామ్ హాజరుకాగా.. స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీ ఊరేగింపుగా కాలనీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నాయకులు అందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరికి సరైన గుర్తింపు లేదని.. ఆ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిందని అందుకే తమ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. ధర్మవరంలో అభివృద్ధి జరగాలన్నా.. ధర్మవరంలో అరాచకాలు ఆగాలన్నా.. అది ఒక పరిటాల శ్రీరామ్ తోనే సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. అందుకే తాము తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చెప్పారు. మరోవైపు పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తెలుగుదేశం పార్టీలోకి వస్తుంటే బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ రూపాల్లో నాయకులపై ఒత్తిళ్లు తెస్తూ పార్టీలోకి రాకుండా ప్రయత్నించారని... కానీ వీటన్నింటినీ లెక్కచేయకుండా చాలామంది తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ప్రతి ఒకరికి కొండ లాంటి అండగా నేను ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం ధర్మవరంలో తెలుగుదేశం పార్టీకి ఏ పరిస్థితి ఉందో ఇంకా మర్చిపోలేదన్నారు. కనీసం తాము తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే పరిస్థితి కూడా ఆరోజు లేదన్నారు. కానీ నాలుగున్నరేళ్లుగా ఇక్కడ ప్రజలు ఇచ్చిన అండతో నిలబడ్డామని.. ఇప్పుడు టిడిపి బలంగా మారడమే కాకుండా వైసిపి నేతలు కూడా ఒక్కొక్కరుగా మనతో వస్తున్నారని శ్రీరామ్ అన్నారు. ఇన్ని రోజులు కష్టపడిన నాయకులంతా ఇంకొక నెల మాత్రం బలంగా కష్టపడాలని సూచించారు. ధర్మవరంలో వైసిపి నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటేనని బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయని నెల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవాలని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖచ్చితంగా అప్పుడు బెదిరింపులు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని అధికారంలోకి వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న బాధ చాలా మందిలో ఉందని కానీ ఈసారి పరిస్థితి అలా ఉండదన్నారు. అభివృద్ధి విషయాన్ని చంద్రబాబు చూసుకుంటారని.. రాజకీయాల్ని ఈసారి నారా లోకేష్ చూస్తారని అన్నారు. ఇప్పుడు అరాచకంగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలన్నది ఆయన చూసుకుంటానన్నారు. నియోజకవర్గంలో ఇలాంటి నాయకుల లిస్ట్ కూడా తాము తయారు చేసినట్లు శ్రీరామ్ తెలిపారు. ధర్మవరం పట్టణంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎక్కడికక్కడ సమస్యలు చెబుతున్నారని పట్టణంలో వారానికి ఒకరోజు తాగునీరు వస్తుందంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. మరోవైపు చీరల పాలిష్ కార్మికులకు అండగా ఉంటామన్నారు. వారికి ఇప్పటివరకు ఎలాంటి సబ్సిడీలు అందడం లేదని అలాగే ఇంటి పట్టాలు కూడా అందడం లేదన్నారు. వీరికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి పట్టాలు, సబ్సిడీలు అలాగే ఎవరైనా కార్మికులు గాయపడితే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్సలు అందేలా చూస్తామన్నారు. మరోవైపు మహిళలకు స్టిచ్చింగ్ యూనిట్లు కూడా తీసుకుని వచ్చి వారికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఆసరా వడ్డీ లేని రుణాల పేరుతో సీఎం జగన్ ఒక మాయ చేస్తున్నారని ఇదంతా ఒక మ్యాజిక్ షోని తలపిస్తోందన్నారు. మీకు వచ్చే లబ్ధి కంటే మీరు బ్యాంకులకు చెల్లించిన మొత్తం ఎక్కువగా ఉందని అది మీరు ఒకసారి సరి చూసుకోవచ్చన్నారు. చంద్రబాబు ఇలాంటి మోసపు మాటలు మాట్లాడరని.. నేడు చాలామంది మహిళలు తమ కాళ్ల మీద నిలబడ్డారంటే అదే చంద్రబాబు ఘనతనని శ్రీరామ్ అన్నారు. మరోవైపు జగన్ కోడిని మింగేవాడైతే.. ఎమ్మెల్యే కేతిరెడ్డి కోడితోపాటు కోడి గుడ్డు, బొచ్చును కూడా మింగేవాడని కామెంట్ చేశారు. గతంలో ధర్మవరంలో సాగే ప్రత్యక్ష అరాచకాలకు పరిటాల రవి ఎదురు నిలిచి పోరాడారని కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కేతిరెడ్డి హైటెక్ పద్ధతిలో భూ అరాచకాలు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు వీటన్నింటికీ చెక్ పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక సరి కొత్త పాలన చూపిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంకా పార్టీలోకి ఎవరైనా రావాలనుకుంటే కచ్చితంగా వారికి తాము అండగా ఉంటామని ధైర్యంగా పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు....

పార్టీలోకి చేరిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.. 17వ వార్డుకు చెందిన కలి, కార్తీక్, అస్లాం, గణేష్, ఓం రాజు, సాయి, యుగంధర్, ఓబిలేస్, ఆంజనేయులు, నరసింహులు, డి.శ్రీనివాసులు, డి.ధనుష్, ఆచారి సూరి, కాసిం, ప్రసాద్, బద్రి, రవి, గుర్రం ఆది, మున్నా, శ్రీనివాసులు, రమేష్, సుబ్రహ్మణ్యం, రమణ, బాషా, ఏడుకొండలు, రమేష్, వెంకటేష్, ఆదినారాయణ బన్నీ వివేక్ లతో కలిసి మొత్తం 50 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు..

Thumbnails pm new2

Thumbnails pm new1

Comments

-Advertisement-