ఇద్దరు మైనర్ బాలికలను ట్రేస్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
ఇద్దరు మైనర్ బాలికలను ట్రేస్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు...
-అప్రమత్తమై పోలీసులకు వెంటనే సమాచారం అందించిన ప్రధానోపాధ్యాయుడు
-టెక్నికల్ సహాయంతో ట్రేస్అవుట్ చేసిన పోలీసులు
-మూడవ పట్టణ పోలీసులను అభినందించిన ఉన్నతాధికారులు
ప్రొద్దుటూరు ఫిబ్రవరి 26 (పీపుల్స్ మోటివేషన్):-
ప్రొద్దుటూరు పట్టణంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల లో ఉదయం చాలా మంది పిల్లలు పాఠశాలకు వస్తున్నారు. అయితే ఇద్దరు మైనర్ బాలికలు తమ ఇంటి నుండి పాఠశాలకు అని బయలుదేరి స్కూల్ గేట్ వరకు వచ్చి అక్కడనుండి ఎక్కడికో వెళ్ళిపోయారు.
స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంటనే ప్రొద్దుటూరు 3 వ పట్టణ పోలీసులకు విషయం తెలియడంతో, అలెర్ట్ అయిన పోలీసులు బాలికల తల్లిదండ్రులను పిలిపించి వివరాలు సేకరించి వెతుకుతుండగా సదరు అమ్మాయి ఒకరు గుర్తు తెలియని వారి సెల్ తీసుకొని వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి నా కోసం వెతక వద్దు, పోలీసులకు పిర్యాదు చేయవద్దు, ఒకవేళ పోలీసులకు పిర్యాదు చేస్తే చచ్చిపోతాను అని బెదిరించడం జరిగింది. పోలీసులు ఉన్నతాధికారులకు తెలిపి టెక్నికల్ సమాచారం తో బాలికలు పోన్ చేసిన నెంబరు వివరాలు సేకరించి వారితో మాట్లాడి సదరు బాలికలు ఎక్కడికి పోతున్నారో వారిని ఫాలో అవమని పోలీసులు కోరడం తో ఆ వ్యక్తి ఆ బాలికలు పోతున్న ఆటో ను ఫాలో అవుతుండగా, ప్రొద్దుటూరు 3 వ పట్టణ పోలీసులు అప్పటికే అక్కడికి వారి తల్లిదండ్రులలో పాటు చేరుకొని వారిని గుర్తించి పట్టుకోవడం జరిగింది.
పాఠశాల కి పిల్లలు రాకపోవడం తో ప్రధాన ఉపాధ్యాయులు వారు వెంటనే పోలీసులకు తెలపడం, పోలీసులు వెంటనే తల్లిదండ్రులను,పిలిపించడం, వెంటనే పోలీసులు టెక్నికల్ గా సమాచారం పెట్టి సదరు ఇబ్బరు బాలికలను ట్రేస్/ట్రాక్ చేసి పట్టుకోవడం అంతా 3 గంటలలో ముగిసింది.
తల్లిదండ్రులకు పిల్లలకు పోలీసులు కౌన్సెలింగ్ చేసి వారి ఇళ్లకు పంపించడం జరిగింది. మిస్ అయిన ఇద్దరు బాలికలను ట్రాక్ చేయడం లో ప్రధానంగా ప్రొద్దుటూరు 3 వ పట్టణ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు మరియు కానిస్టేబుల్ గురివి రెడ్డి ఇద్దరూ ప్రొెషనల్స్ గా పని చేసి శభాష్ అని అనిపించుకున్నారు.