పాతది రద్దు..కొత్త నోటిఫికేషన్ విడుదల
పాతది రద్దు..కొత్త నోటిఫికేషన్ విడుదల
ఈ రోజే 11,060 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
2023 నోటిఫికేషన్ ను రద్దు...
ఈ సారి ఆన్లైన్ విధానంలో పరీక్షల నిర్వహణ
పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదు
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిఎస్పీ నోటిఫికేషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే...ఈ రోజు టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 11,060 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ను ప్రభుత్వం గురువారం విడుదల రంగం సిద్ధం చేసింది.
వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629 పోస్ట్ లకు, లాంగ్వేజ్ పండిట్ 727 పోస్ట్ లకు, పీఈటీలు 182 పోస్ట్ లకు, ఎస్జీటీలు 6,508 పోస్ట్ లకు, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్ట్ లకు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయని వివరాలు తెలిపారు. దరఖాస్తు చేసుకునే విధానం, దరఖాస్తుల గడువు పక్రియ, నియమ నిబంధనలను నోటిఫికేషన్ లో వెల్లడించనున్నారు. ఈ సారి ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని. కొత్త నోటిఫికేషన్ కు నిర్ణయించిన ప్రభుత్వం..గత ఏడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన2023-డీఎస్సీ ప్రకటన రద్దుకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పాత నోటిఫికేషన్ లో అప్లై చేసిన అభ్యర్థుల దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని పాఠశాలల్లో విద్యార్థులను పెద్దఎత్తున చేర్చేందుకు నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. డీఎస్సీతో ఉపాధ్యాయుల కొరత తీరనున్నందున విద్యార్థులను పెద్దఎత్తున చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు. కళకళలాడుతాయని సర్కారు భావిస్తోంది. జాతీయ సగటు మేరకు ప్రతి 17 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నిర్ణీత పరిమితి కంటే తక్కువగా ఉంది. దీంతో విద్యార్థులను దామాషాకు అనుగుణంగా పెంచేందుకు ప్రభుత్వం దిశానిర్దేశనం చేయనుంది.
సంవత్సరానికి రెండుసార్లు టెట్...?
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను ఏటా రెండు సార్లు(జూన్, డిసెంబర్) నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విద్యా శాఖ ప్రతిపాదనకు సీఎం రేవంత్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. కొన్నేళ్లుగా బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారే టెట్ రాసేవారు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు పేపర్-2లో క్వాలిఫై కావాలన్న నిబంధన ఉండటంతో టీచర్లు సైతం టెట్ రాస్తున్నారు. దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.