పాణ్యం నియోజకవర్గం లో భారీగా వైసీపీ ను వీడి టీడీపీ లోకి వలసలు
tdp news, panyam news, panyam consistency news, charitha mla news, kurnool news, tdp political news
By
Peoples Motivation
ఓర్వకల్లు/కర్నూలు, ఫిబ్రవరి 02 (పీపుల్స్ మోటివేషన్):-
ఈరోజు పాణ్యo నియోజకవర్గం, ఓర్వకల్లు మండలం, కాల్వ గ్రామం నుంచి మాజీ ఉపసర్పంచ్ ఖాదర్ బాషా తో పాటు 20 కుటుంబాలు పాణ్యo మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి సమక్షం లో, పాలకొల్లు సుధాకర్ రెడ్డి మరియు కాల్వ రజాక్ ఆధ్వర్యం లో వైసీపీ నుంచి టీడీపీ లో చేరారు.
వీరoదరికి గౌరు చరిత రెడ్డి టీడీపీ కండువాలు కప్పి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ అరాచక వైసిపి దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలోచనతో టిడిపిలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని గౌరు చరిత రెడ్డి తెలిపారు.
కాల్వ గ్రామం నుంచి
వైసీపీ నాయకులు ఖాదర్ బాషా, ఖాజా హుస్సేన్, గోపాల్, పి.రసూల్, బోయ భాస్కర్ నాయుడు, సద్దాం ఖాన్, పెద్ద హనీఫ్, నాభి సాహెబ్, చిన్న హుస్సేన్, షేక్ మాబాషా, అలీ ఖాన్, మద్దిలేటి షేక్ మహబూబ్ తదితరులు తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ లో చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు అని, ఈ ప్రభుత్వం లో విసుగుచెందాం చంద్రబాబు తోనే పాణ్యం అభివృద్ధి సాధ్యం అందువలన టీడీపీ లో చేరడం జరిగింది అని తెలిపారు.
Comments