రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఇంటర్ మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి..

Inter exam timetable? Inter exams latest updates? Inter exams timetable in telugu? Intermediate exams precautions?inter exams in AP?inter exams in TS?
Peoples Motivation

ఇంటర్ మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి..

కర్నూలు, (పీపుల్స్ మోటివేషన్):-

గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో డిఆర్ఓ కె మధుసూదన్ రావు సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా లో మార్చి 1 నుండి 20 వ తేదివరకు జిల్లాలో నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలను సంబందిత అధికారులు సమన్వయం చేసుకొని ఏలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రతగా విధులు నిర్వహించాలన్నారు. 

జిల్లాలోని 69 పరీక్ష కేంద్రాల్లో 47412 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అందులో మొదటి సంవత్సరం విద్యార్థులు..22239 మంది, ఇంటర్ రెండవ సంవత్సరం25173 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టిక్కెట్లను సంబంధిత కళాశాలలో సకాలం లో విద్యార్థుల కు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబందించిన అధికారుల కు సూచించారు.పరీక్షా కేంద్రాలలో సీటింగ్, లైటింగ్, త్రాగు నీరు, మరుగుదొడ్లు ఉండేలా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 8.30 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకొనే విదంగా ఆర్.టి.సి బుస్సు లను నడపాలని మంత్రాలయం, ఆదోని పెద్దకడుబూరు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్టీసీ అధికారులకు చూచించారు. పరీక్ష సమయం లో విద్యుత్ ఆంతరాయం కలగకుండా చూడాలని సంబందిత విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు రవాణా శాఖ అధికారులు అవసరమైన వాహనాల ఏర్పాట్లు చేయాలని, పరీక్షలు పూర్తి అయిన తరువాత సమాధాన పత్రాలను సీల్డ్ కవర్ లో పోస్టల్ శాఖ కు వెంటనే పంపించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల నందు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్స్, ఏ.ఎన్.ఏం లను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. మున్సిపాలిటిలోను , పంచాయతీలలోను, పరీక్ష కేంద్రాల లో శానిటేషన్ మరియు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కేంద్రాల సమీపం లో వున్న జిరాక్స్ షాప్ లను మూసివేసెలా కార్మిక శాఖ వారు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల నందు అవసరమైన పోలీసు బందోబస్తును, పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ శాఖ కు చూచించారు.సమస్యాత్మక పరీక్ష కేంద్రాలైన పత్తికొండ, దేవనకొండ, కోసిగి, చిప్పగిరి, ఆలూరు లో సీసీ కేమరాలతో పాటు పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి,ఆర్ఐఓ గురువయ్య శెట్టి,DVEO జమీర్ భాష,జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్, వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్ డిఈ రవికుమార్, ఏపీఎస్పీడీసీఎల్.. ఈఈ ఓబులేసు,ఆర్టిసి,తపాలా శాఖ వారు, కార్మిక శాఖ, పోలీస్ శాఖ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Thumbnailspm

Thumbnailspma

Comments

-Advertisement-