రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బుడగ జంగాల కాలనీ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి

ts news, political news, mla news, congress news
Peoples Motivation


బుడగ జంగాల కాలనీ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి 

--కాలనీలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు 

--ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి




వనపర్తి బ్యూరో ఫిబ్రవరి 04 ( పీపుల్స్ మోటివేషన్ ) వనపర్తి పట్టణంలోని 8వ వార్డు 9వ వార్డులో బుడగజంగాలు,బుడుబుక్కలు, మొండి వాళ్లు,నివసించే కాలనీల అభివృద్ధి కోసం తాను ప్రత్యేక దృష్టి సారించి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.ఆదివారం ఆయన వారి ఆవాసప్రాంతంలో పర్యటించారు.అక్కడ కనీస మౌలిక వసతులు కూడా లేని వారి జీవన విధానాన్ని చూసిన ఎమ్మెల్యే చెల్లించి పోయారు.గత పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో ఇంతటి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న వీరి జీవన స్థితిగతులను పట్టించుకోకుండా గాలికి వదిలేయడం వారి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కాలనీవాసులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు కాలనీలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు చేపడతామని ఆయన వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మాజీ జెడ్పిటిసి సభ్యులు గొల్ల వెంకటయ్య,పట్టణ అధ్యక్షులు చీర్లచందర్,కౌన్సిలర్లు విభూది నారాయణ,చీర్ల సత్యం సాగర్,నాయకులు చీర్ల జనార్ధన్, శివకుమార్,రాములు,అంజి,సత్యం, వాల్యనాయక్,కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-