ఘనంగా జరిగిన "అర్బన్ స్థాయి" పల్లెకు పోదాం శిక్షణ కార్యక్రమం
ఘనంగా జరిగిన "అర్బన్ స్థాయి" పల్లెకు పోదాం శిక్షణ కార్యక్రమం -కొట్టె మల్లికార్జున
డోన్, ఫిబ్రవరి 04 (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి, క్లస్టర్ ఇంఛార్జి సావిత్రమ్మ, ఇంటి ఆది నారాయణ ఆదేశాలతో జిల్లా కన్వీనర్ నటేశ్, కో.కన్వీనర్ రామకృష్ణారెడ్డి, కో కన్వీనర్ కొట్టె మల్లికార్జున సమన్వయంతో
పల్లెకు పోదాం కార్యక్రమం డోన్ నియోజకవర్గంలోని డోన్ పట్టణం నందు కన్వీనర్ సందు వెంకటరమణ ఆధ్వర్యంలో మరియు పట్టణ మండల అధ్యక్షులు రాజశేఖర్ అధ్యక్షతన, ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్, ఎస్టి మోర్చా అధ్యక్షులు దేవేంద్ర, ఎస్టి మోర్చా కార్యవర్గ సభ్యులు శివ, జిల్లా ఓబీసీ మోర్చ అధ్యక్షులు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి అశోక్, మాజీ కార్యదర్శి రామచంద్ర నాయుడు అలాగే పట్టణ పంచాయతీల కన్వీనర్ శివప్రకాష్, కో కన్వీనర్ ఉషాలక్షి సహకారంతో వార్డ్స్ స్థాయి కార్యకర్తలు శిక్షణ కార్యక్రమం జరిగింది. శిక్షణ కార్యక్రమంలో "ఫిబ్రవరి 9,10,11 "న "పల్లె పల్లెకు బిజెపి గడప గడపకు బిజెపి" చేరువ కావడానికి ముఖ్య సూచనలను డోన్ నియోజకవర్గం కన్వీనర్ సందు వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్, నంద్యాల జిల్లా పల్లెకు పోదాం కో.కన్వీనర్ కొట్టె మల్లికార్జున, మండల అధ్యక్షులు రాజశేఖర్, మండల కన్వీనర్ శివ ప్రకాష్, కో కన్వీనర్ ఉషాలక్ష్మి, అలాగే పాల్గొన్న వార్డ్స్ నాయకులు తమ అభిప్రాయాల్ని తెలియచేశారు.
అలాగే ఫిబ్రవరి 9,10,11న జరిగే పల్లెకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతముగా పూర్తి చేస్తామని పాల్గొన్న ప్రతి నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. గావో చలో అభియాన్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ గావ్ చలో అభియాన్ కార్యక్రమం జిల్లా కో. కన్వీనర్&డోన్ నియోజకవర్గం బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున ధన్యవాదాలు తెలిపారు.