మున్సిపాలిటీ లో కాల్వల పరిస్థితి చూడతరమా.
MUNICIPALITY NEWS, AP NEWS, NANDYAL NEWS, DRYNAGE NEWS, MUNICIPAL CORPORATION NEWS,
By
Peoples Motivation
మున్సిపాలిటీ లో కాల్వల పరిస్థితి చూడతరమా...
నంద్యాల, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్):-
మున్సిపాలిటీ లో కాల్వల పరిస్థితి చూడతరమా చాలా దారుణంగా ఉందని లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రస్తుతం ఉన్న సిబ్బంది కాకుండా అత్యవసరంగా సిబ్బంది కాల్వల్లో పూడికల కోసం 60 మందిని ఏర్పాటు చేశారు. ఆ సిబ్బంది నిజంగా 60 మంది పని చేస్తున్నారా. వారిలో కొందరు బినామిగా వుంటూ జీతాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శానిటేషన్ సిబ్బందికి ప్రతి నెల అక్షరాల కోటి 30 లక్షలు జీతాలకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
దోమల నివారణ పట్టించుకోరు,కాల్వల్లో పూడికలు తీయరు పన్నులు మాత్రం కట్టించుకుంటారంటూ ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి శానిటేషన్ పై శ్రద్ద పెట్టినా శానిటేషన్ అధికారులు సరిగా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బస్ స్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు వున్న కాల్వ లో చెత్తా,చెదారం లేకుండా ఒకరోజైనా చూడాలని ప్రజల అనుకుంటున్నారు. డబరాల మసీదు ఎదురుగా రోజు కాల్వల్లో చెత్త అడ్డం పడుతూ రోజు మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుంటుంది. అధికారుల పనితీరుకు ఇది నిదర్శనం అని సందు గొందుల్లో ఇక చెప్పనవసరం లేదంటున్న ప్రజలు. సాయంత్రం బయటికి రావాలంటేనే దోమల భాదతో ప్రజలు బయటికి రాని పరిస్థితని చర్చించుకుంటున్నారు.
Comments