స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతి...
స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతి
డోన్, ఫిబ్రవరి 13(పీపుల్స్ మోటివేషన్):-
డోన్ పట్టణంలో టి ఆర్ నగర్ లోని ఎంపీపీ స్కూల్ హెచ్ఎం జి.సురేంద్రనాథ్ రావు అద్యక్షతన స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ ఎం డి అబ్దుల్ కలాం, కె.వి. సతీష్ కుమార్, ఎస్. మధురవాణి ,ఎస్. శంషాద్ బేగం, టి.హరీష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.
శ్రీమతి సరోజినీనాయుడు ఫిబ్రవరి 13, 1879 జన్మించారు. భారత కోకిల గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీదేవి మన భారతదేశపు తొలి మహిళా గవర్నరు. భారతదేశం పైన, భారతీయుల పట్ల ఆమెకున్న ప్రేమ, వాత్సల్యం ఆమె సొంత ఆరోగ్య విషయం కూడా మరచిపొయ్యె విధంగా చేశాయంటే ఆమె దేశభక్తిని, త్యాగనిరతిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలోనే ఒక బహిరంగ సభలో ఉపన్యసిస్తూ, బ్రిటిషు పాలకులు భారతదేశాన్ని స్వంతంగా భావించడమే అపరాధం, భారతీయులను బానిసలుగా చేసి వారి ప్రాణాలు సైతం బలి తీసుకోవటం క్షమించరాని అపరాధం" అంటూ ఆడపులిలా గర్జించింది. ఆమె ఉపన్యాసాలు, ఉద్వేగం సక్రమమైనవి కావనీ, ఇకపై అటువంటి ప్రచారం చెయ్య వద్దనీ, బ్రిటిష్ ప్రభుత్వం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. తనకే రకమైన శిక్ష విధించినా యధార్థాన్ని ప్రచారం చేయక మాననని నిర్భయంగా సమాధానం చెప్పింది సరోజినీ నాయుడు. ఒక భారత స్త్రీకి దేశంపై గల ప్రేమను, స్వాతంత్ర్య పోరాటాన్ని అర్థం చేసుకుని గాంధీజీ అభినందించారు. సరోజినీనాయుడు పై గల విశ్వాసంతో, ఉద్యమనాయకత్వం ఆమెకు అప్పగించారు. చనిపోయే వరకు దేశ ప్రజల భవిష్యత్తును గురించి బ్రిటిష్ వారి ఘోర పరిపాలన గురించి రచనలు చేస్తూనే ఉంది. కావున ప్రతి మహిళ అమెను ఆదర్శంగా తీసుకొని మన దేశానికి సేవ చెయ్యాలని మన మందరం స్వాతంత్ర్య సమరయోధుల అడుగుజాడలలో నడుద్దామని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, స్కూల్ హెచ్ ఎమ్ జి. సురేంద్రనాథ్ రావు కోరారు. అలాగే సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి విద్యార్థులకు ఆరోగ్యం,కాలుష్యం పై అవగాహణ కలిగించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా దోమకాటు నుంచి వచ్చేవిష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ నిరోధించాలి. ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలి. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ - ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులను సంప్రదించకుండా నొప్పులు మాత్రలు వాడరాదు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని,నీళ్ళు శరీరానికి తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.