రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించండి

GENERAL NEWS, TELUGU NEWS, DAILY NEWS, KURNOOL DIST NEWS
Peoples Motivation

ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించండి

రాయలసీమ యూనివర్సిటీ వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ కి వినతి 

పీ డీ ఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్

కర్నూలు, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్):-

కర్నూలు పట్టణంలో రాయలసీమ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ ని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

2014 అకాడమిక్ ఇయర్ సంవత్సరం నుండి ఇప్పటిదాకా డిగ్రీలో ఫెయిల్ అయి సబ్జెక్టులు మిగిలిన విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలను నిర్వహించాలనీ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్ అన్నారు.

ఈ సందర్భంగా పీ డీ ఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్, జిల్లా అధ్యక్షుడు అఖండ, జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, నగర అధ్యక్షుడు దామోదర్ మాట్లాడుతూ 2014 సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుండి డిగ్రీలో ఫెయిల్ అయి సబ్జెక్టులు మిగిలిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదని ఉన్నారు. కేవలం అకాడమిక్ నుంచి మూడుసార్లు పరీక్ష రాయడానికి పర్మిషన్ ఇచ్చే, తర్వాత పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వలేదని అన్నారు. జిల్లావ్యాప్తంగా వేలమంది విద్యార్థులు 1, 2 సబ్జెక్టులు ఫెయిల్ అయి గ్రామీణ ప్రాంతాల్లో కూలీలుగా మారారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తున్నాయని, ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. కొంతమంది విద్యార్థులు రీ అడ్మిషన్ తీసుకొని మళ్ళీ మూడు సంవత్సరాలు చదువుతున్నారని ప్రతి విద్యార్థికి మూడు సంవత్సరాలు నష్టం జరుగుతుందని అన్నారు. కావున 2004 నుండి మూడు సంవత్సరాల డిగ్రీ విద్యార్థులకు అదేవిధంగా సెమిస్టర్ విధానంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేయర్ కుమార్ స్పందించి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు వీరేష్, శేషు, సుకుమార్, రఫీ మొదలైన వారు పాల్గొన్నారు.

Thumbnailspm

Comments

-Advertisement-