జగన్ ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండు
political news,
By
Peoples Motivation
జగన్ ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండు
...ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు
జనసేన పార్టీ రాయలసీమ విభాగం వీర మహిళ కోఆర్డినేటర్ హసీనా బేగం
కల్లూరు/కర్నూలు, ఫిబ్రవరి 04 (పీపుల్స్ మోటివేషన్):-
రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్ మోహన్ రెడ్డి ని నమ్మే పరిస్థితుల్లో లేరని జనసేన, తెలుగుదేశం పార్టీ ల వైపు ఉన్నారని ఇంక జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ రాయలసీమ విభాగం వీర మహిళ కోర్డినేటర్ హసీనా బేగం అన్నారు.
కల్లూరు లో జనసేన పార్టీ జెండా ను జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల కో ఆర్డినేటర్ చింత సురేష్ బాబు అధ్యర్యంలో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి 32 వార్డు ఇంచార్జ్ సుధాకర్ హాజరు అయ్యారు. ఈ సందర్బంగా హసీనా బేగం మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే ఎవరు నమ్మే పరిస్థితి లో లేరని అన్నారు. 2024 లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని అన్నారు. అమ్మవడి ఇంత వరకు చాలా మందికి అంద లేదని అన్నారు. నిరుద్యోగ సమస్య కుడా అలాగే ఉందని తెలిపారు.పవన్ కళ్యాణ్ మన భవిష్యత్ గురించి, మన పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో రెండు పార్టీలు ఉన్నాయని చెల్లి కాంగ్రెస్ లో ఉంటే అన్న సొంత పార్టీ లో ఉన్నారని అన్నారు. అనంతరం కల్లూరు మండలం చిన్నటేకూర్ లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు పల్లవి,అనిత, రేణుక,గంగవతి, సుమలత, పద్మ, సుధాకర్, రాంబాబు, రాము, సతీష్ కల్లూరు మండలం జనసేన నాయకులు బజారి హాజరు అయ్యారు.
Comments