బైక్ దొంగతనాలు చేస్తున్న ఐదుగురు దొంగల అరెస్ట్...
బైక్ దొంగతనాలు చేస్తున్న ఐదుగురు దొంగల అరెస్ట్...
మొత్తం 12 లక్షల 50 వేల రూపాయల విలువైన 16 మోటార్ సైకిల్లు స్వాదీనం..
కేసును చేదించిన తిరుపతి క్రైమ్ పోలీసులు...
తిరుపతి, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లా ఎస్పీ మాలిక గర్గ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ క్రైమ్ వేమల కుమారి కేసు వివరాలు వెల్లడించారు.
ఈ మధ్యకాలంలో తిరుపతి పట్టణంలో బైక్ లను దొంగతనం చేస్తున్న ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 16 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో తిరుపతి ఈస్ట్, అలిపిరి, పాకాల, పెనుమూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 కేసులను ఛేదించిన వివరాలను గురువారం నాడు తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ క్రైమ్ విమల కుమారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.
అరెస్టు అయిన ముద్దాయిల వివరాలను వెల్లడించారు. గత కొన్ని నెలలుగా తిరుపతి నగరములో జరిగిన పలు మోటార్ సైకిల్ దొంగతనాల పై నిఘా ఉంచి, చేదించాలని జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఇదివరకే జిల్లా పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా అదనపు క్రైమ్ ఎస్పీ విమలా కుమారి తన స్వీయ పర్యవేక్షణలో, తిరుమల క్రైమ్ డిఎస్పీ రవి కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి సిసిఎస్ సీఐ రామకృష్ణ, తిరుపతి రూరల్ సీఐ తమీమ్, ఎస్సై, క్రైమ్ పార్టీ సిబ్బంది వేర్వేరు బృందాలుగా ఏర్పడి, తీవ్రంగా గాలించి, నేరస్తుల గురించి రాబడిన సమాచారము మేరకు 21-02-2024 వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1:30pm గంటలకు తిరుపతి - అలిపిరి బై పాస్ రోడ్డు లో టాటా క్యాన్సర్ హాస్పిటల్ సమీపములో అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ కేసులో మొదటి ముద్దాయి A1 కాకాసి సాత్విక్ పాత నేరస్థుడు. ఇతని పై డెకాయిటీ, రాబరీ, రాత్రివేళ ఇంటి దొంగతనాలు, మోటార్ సైకిల్ నేరాలకు సంబంధించిన పాత కేసులు కలవు. ఇతర ముద్దాయిలు అందరూ నేర ప్రవృత్తి కలిగి నేరాలు చేస్తూ, వారి చెడు అలవాట్లకు, వ్యసనాలకు సులభంగా డబ్బులు సంపాదించాలని గత సంవత్సరం 2023 లో మిత్రుల సహకరముతో A1. సాత్విక్ తో కలసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి, తిరుపతి చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 16 మోటార్ సైకిల్ దొంగతనం నేరాలు చేశారు. ఈ కేసులలో విశేష ప్రతిభ చూపిన టీం లకు జిల్లా ఎస్పి మలిక గార్గ్ రివార్డులను ప్రకటించారు.