నగరంలో దోమలకు, ప్రస్తుత నాయకులకు రోజులు దగ్గరపడ్డాయి..
కర్నూలు టౌన్, (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూల్లో ఇప్పుడు పాలిస్తున్న నాయకుడితో పాటు ఈ ప్రభుత్వం కూడా త్వరలోనే దుకాణం సర్దుకోబోతుంది. ఇక వచ్చేది తెలుగుదేశం, జనసేన ప్రభుత్వమే. నగరంలోని 11వ వార్డు ఖడక్‌పుర వీధిలో నిర్వహించిన దోమలపై దండయాత్ర కార్యక్రమంలో టీజీ భరత్ పాల్గొని, ప్రాణాలు తోడేస్తున్న దోమల నుండి ప్రజలను రక్షించేందుకు మా ఫ్యాక్టరీ నుండి ఉచితంగా హైపో ఇవ్వగా, మా పార్టీ నేత మెహబూబ్ ఖాన్ స్వతహాగా ముందుకొచ్చి ఆల్ అవుట్‌లూ, పిచికారి మిషన్లు తీసుకొని వీధుల్లో హైపో ద్రావణం పిచికారి చేయడంతో పాటు ఫాగింగ్ కూడా చేయిస్తున్నారు. ఎంతో విలువైన, పవర్ కలిగిన హైపోను మున్సిపల్ అధికారులకు ఉచితంగా ఇస్తామని చెప్పినా రాజకీయ ఒత్తిళ్లతోనే వాళ్లు తీసుకునేందుకు ముందుకు రాలేదని అర్థమవుతోంది అని మనం మనం ఒకే కులం అని మీ వీధికి, మీ ఇంటికి ఓట్లు అడిగేందుకు వస్తున్న నాయకులకు కంపు కొడుతున్న మురుగు కాల్వలు చూపించి ఎలా బ్రతకాలని నిలదీయండి. ముస్లీం సోదర సోదరీమణులందరికీ ఒకటే చెబుతున్నా.
ఇప్పటి నాయకులు కులం, మతం పేరుతో కర్నూలు ప్రజలని విడదీసేశారు. పదేళ్లుగా అధికారంలో లేకపోయినా మేము సేవ చేస్తున్నాం. దేవుడి దయవల్ల మా ఫ్యాక్టరీ ద్వారా మేము బ్రతుకుతూ మాకున్నదాంట్లో నుండి దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నాం అని. ప్రతి సంవత్సరం హిందూ,ముస్లీం,క్రిస్టియన్లకు ఆర్థిక సహాయం చేసి ఉచితంగా వివాహాలు కూడా చేయిస్తున్నాం. ఒకే కులం కావాలంటే ఇవన్నీ ఎందుకు చేస్తాం. మాకు అందరూ సమానమే. కానీ ఇప్పుడున్న నాయకులు ప్రజల సేవ పక్కనపెట్టి సొంత సేవ చేసుకుంటున్నారు. ఓటు వేసే ఒక వారం రోజుల ముందు మా గురించి ఇష్టానుసారంగా మాట్లాడతారు. అసలు మేమేం తప్పు చేశామో చెప్పకుండా, మేమేం కులమో చెప్పి ప్రజలను మాయలో పడేస్తారు. కాబట్టి ఇలాంటివి నమ్మకుండా ఎవరు మంచి చేసే వాళ్లో గ్రహించి నిర్ణయం తీసుకోండి. మంచి నాయకుడి చేతిలో పాలన ఉంటేనే అందరూ బాగుంటారు. ఎందుకంటే ఇప్పటికే మా నాన్న టి.జి వెంకటేష్ ఎలాంటి వ్యక్తో, ఆయన ప్రజలకు ఎంత సేవ చేశారో మీ అందరికీ తెలుసు. ఇక నన్ను గెలిపిస్తే ఆయనలాగే మంచి చేస్తా. ఇప్పుడున్న దోమల సమస్యను కర్నూలు నుండి తరిమికొట్టి, కంపు కొడుతున్న కాల్వలు శుభ్రపరచి, చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించి, మరిన్ని కొత్త కంపెనీలు తీసుకొచ్చి అన్ని వ్యాపారాలు బాగుండేలా చేస్తా. ఇవన్నీ జరగాలంటే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే అందరికీ మంచి సంక్షేమ పథకాలు అందుతాయి. ఇక ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకుడిని సాగనంపి సుపరిపాలన అందించే నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు టీడీపీ ఇంచార్జ్ టీజీ భరత్, మెహబూబ్ ఖాన్ మరియు పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.