ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి
నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని అదుపు తప్పి మరో ముగ్గురు మృతి
మద్యం తాగి కారు డ్రైవింగ్ చేసినట్లు ఆరోపణ
బార్లపల్లి వద్ద బెంగళూరు మదనపల్లి హైవే లో ఘటన
అన్నమయ్య జిల్లా/ మదనపల్లె క్రైమ్, (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని బార్లపల్లె లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే మదనపల్లె మండలంలోని బెంగళూరు -మదనపల్లి హైవే లోని బార్లపల్లె గ్రామం వద్ద అతివేగంతో వస్తున్న కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆ తర్వాత అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తిలక్, విక్రమ్, శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. వీరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.
కారులో ప్రయాణిస్తున్న యువకులు మద్యం తాగి కారు డ్రైవింగ్ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో తమ గ్రామానికి(బార్లపల్లె) చెందిన పాడి రైతులు చంద్ర (50), సుబ్రహ్మణ్యం (62) మృతి చెందారని స్థానికులు చెప్పారు. వారికి న్యాయం చేయాలని బార్లపల్లెలో బెంగళూరు -మదనపల్లి హైవేపై నిరసనకు దిగారు. ఘటనాస్థలిని పరిశీలించి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.