దేశ భవిష్యత్త్.. సుపరిపాలన అందించే పాలకులపై ఆధారపడి ఉంటుంది...
VOTER AWARENESS CAMP, VAGDEVI ENGINEERING COLLEGE, AP NEWS, VOTER AWARENESS PROGRAMME, PRODDATUR NEWS, KADAPA DIST NEWS
By
Peoples Motivation
దేశ భవిష్యత్త్.. సుపరిపాలన అందించే పాలకులపై ఆధారపడి ఉంటుంది..
ప్రజాస్వామ్యంలో యువ ఓటర్ల పాత్ర కీలకం -అమ్మ హెల్పింగ్ హాండ్స్ జిల్లా అధ్యక్షురాలు భారతి
మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలంటే మంచి పాలకులు అవసరం
వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో ఓటర్ అవగాహన సదస్సు...
ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 15 (పీపుల్స్ మోటివేషన్):-

ప్రజాస్వామ్యంలో యువ ఓటర్ల పాత్ర కీలకమని ఓటు హక్కు తప్పకుండా నమోదు చేసుకోవాలని అమ్మ హెల్పింగ్ హాండ్స్ జిల్లా అధ్యక్షురాలు భారతి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో గురువారం భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడ మంత్రిత్వ శాఖ పరిధిలోని నెహ్రూ యువ కేంద్రం, అమ్మ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఓటు నమోదు, ఓటు చైతన్యం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు చింత రామ్మోహన్ రెడ్డి, సుంకర చంద్రమౌళి, అంకాల్ రెడ్డి, అమ్మ హెల్పింగ్ హాండ్స్ జిల్లా అధ్యక్షురాలు భారతి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.సిద్దేశ్వర రావు హాజరయ్యారు.
.webp)
వారు మాట్లాడుతూ... మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలంటే మంచి పాలకులు అవసరం అని, మంచి పాలకులను ఎన్నుకోవాలంటే ఓటు హక్కు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఒకే ఓటుతో అధికారం కోల్పోయిన వారున్నారని ఒక్క ఓటు అధికారం చేపట్టిన వారు ఉన్నారని అక్షరాస్యత కలిగిన హైదరాబాద్ లాంటి నగరంలో పోలింగ్ శాతం తక్కువ నమోదు అయిందన్నారు.అలా జరగకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో ఓటు ఎలా నమోదు చేసుకోవాలో విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ బి.సిద్దేశ్వర రావు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు జి రామాంజనేయరెడ్డి, శ్రీనివాసులు మాట్లాడారు. యువత ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికలలో ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలని దేశ భవిష్యత్తు సుపరిపాలన అందించే పాలకులపై ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments