ఏపీపియస్సి బోర్డ్ మెంబర్ గా -సిద్ధం శివ రామ్
ఏపీపియస్సి బోర్డ్ మెంబర్ గా -సిద్ధం శివ రామ్
హర్షం వ్యక్తం చేసిన అభిమానులు, నిరుద్యోగులు
ఉద్యోగ నోటిఫికేషన్ లు సకాలంలో వచ్చేలా కృషి చేస్తా- సిద్ధం శివ రామ్
నంద్యాల, (పీపుల్స్ మోటివేషన్ న్యూస్):-
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపియస్సి)బోర్డు మెంబర్ గా సిద్ధం శివరామ్ ఎంపికయ్యారు. శివ రామ్ గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మార్కెట్ చైర్మన్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు నంద్యాల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వివిధ పదవులు నిర్వహించారు.

ఈ మేరకు ఆయన అభిమానులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు మీరూ పొంది ప్రజా సేవ చేస్తారని వారు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను ఏపీపీయస్సీ బోర్డ్ మెంబర్ గా ఎంపిక చేయడం పట్ల నంద్యాల శాసన సభ్యులు శిల్ప రవి చంద్ర రెడ్డి, సిఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. నిరుద్యోగుల సమస్యలను ఏపీపియస్సి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.