సొంతపార్టీ నేతపై వైసీపీ నేతల నిర్వాకం .. !
political news, ycp news, nandyal ycp news, nandyal political news
By
Peoples Motivation
- పోలీసులు నిర్భంధంలో తల్లి, కొడుకు..!
- కొనసాగుతున్న “నీ... అమ్మ....మొగుడు వివాదం”..!
- సొంతపార్టీ నేతపై వైసిపి నేతల నిర్వాకం .. !
నంద్యాల (పీపుల్స్ మోటివేషన్) :
నంద్యాల జిల్లా కేంద్రంలో వైసిపి నేతల మధ్య విభేదాలు తారస్టాయికి చేరుకున్నాయి. రోజు రోజుకు ఈ విభేదాలు మరింత పెరిపోతుండటంతో వైసిపి శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. నంద్యాల మండల జెడ్పిటిసి సభ్యుడు గోపవరం గోకుల కృష్ణా రెడ్డి స్థానిక వైసిపి నేతలు ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి, మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా లోకల్ నినాదంతో మొదలు పెట్టిన నిరసన అతకంతకు పెరిగిపోతుంది. దీంతో అప్పుడడప్పుడు.. అటు పార్టీ శ్రేణులకు, ఇటు పోలీసులకు టెన్షన్ తప్పడం లేదు.
నంద్యాల పట్టణ నడిబొడ్డున గాంధీ చౌక్ లో .. జాతి పిత మహాత్మాగాంధీ గాంధీ సాక్షిగా జరిగిన వైసీపీ సామాజిక బస్సు యాత్రలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి చేసిన పాకిస్తాన్ – ఇండియా, తనయుడు ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి చేసిన తమను నంద్యాల నుంచి తరిమికొట్టే మొనగాళ్ళు ఎవరు లేదని వ్యాఖ్యానించడం..
ఆతరువాత సామాజిక మాధ్యమాల్లో “నీ... అమ్మ మొగుడు వచ్చాడు..!” అంటూ పెట్టిన పోస్టింగ్ గోకుల్, శిల్ప మద్య వివాదం మరింత ముదరడానికి కారణం అయింది. ఈ నేపద్యంలో గోకుల్ కృష్ణా రెడ్డి ఆత్మగౌరవ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అదే విధంగా గోకుల్ కృష్ణా రెడ్డి స్థానిక మహిళల ఆత్మగౌరవం నినాదంతో శనివారం చేపట్టిన దీక్షను సైతం గోకుల్ కృష్ణా రెడ్డిని గృహనిర్భందం చేసి అడ్డుకున్నారు. దీంతో గోకుల్ కృష్ణా రెడ్డి తల్లి భీమవరం గ్రామ సర్పంచ్ భక్తవత్సలమ్మ తన తనయుడు గోకుల్ కృష్ణా రెడ్డి , స్థానిక ఎంఎల్యే శిల్ప రవి చంద్రకిశోర్ రెడ్డి పేరుతో సామాజిక మాధ్యమాల్లో పెట్టిన “ నీ... అమ్మ మొగుడు వచ్చాడు ..” అనే వ్యాఖ్యలకు చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో, స్వయంగా భక్తవత్సలమ్మ రంగంలోకి దిగారు. ఎంఎల్యే సామాజిక మాద్యమలో పెట్టిన వ్యాఖ్యల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు... ఎవరికి మొగుడు.. ఎవరి అమ్మకు మొగుడు..? సమాధానం చెప్పాలని గోకుల్ కృష్ణా రెడ్డి మాతృమూర్తి భక్తవత్సలమ్మ ఎమ్మెల్యే ను సూటిగా ప్రశ్నించారు.
నంద్యాల నియోజక వర్గ మాతృమూర్తుల అవమానించే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేసిన ఎంఎల్యే పై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయ్యనున్నట్టు ఆమె చెప్పారు. భక్తవత్సలమ్మ చేపట్టిన ఈ దీక్షకు భారీ సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు. మరో వైపు వైసీపీ నేతలు అదే “నీ అమ్మ మొగుడు” డైలాగ్ ను వినియోగించి గోకుల్ కృష్ణా రెడ్డి పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో.. గోకుల్ కృష్ణా రెడ్డి తల్లి తమ కుమారుడి పేరుతో తప్పుడు వీడియోస్ సృష్టించి .. తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
![]() |

User
Comment Poster
పీపుల్స్ మోటివేషన్ నంద్యాల
Reply to This Comment
Comments