దోమల నివారణకు వైసీపీ జడ్పిటిసి ఔదార్యం...
political news, municipality news, ycp news
By
Peoples Motivation
దోమల నివారణకు వైసీపీ జడ్పిటిసి ఔదార్యం...
సొంత నిధులతో 10 పాగింగ్ మిషన్లు,10 పిచికారి మిషన్లు...లాంఛనంగా ప్రారంభం.
నంద్యాల, ఫిబ్రవరి 06 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల పట్టణంలో దోమల నివారణకు వైసీపీ జెడ్పిటిసి ఔదార్యం చూపారు. సొంత నిధులతో 10 ఫాగింగ్ మిషన్లు,10 పిచికారి మిషన్లు తెప్పించారు. నంద్యాల పట్టణంలో దోమల నివారణకు మున్సిపల్ అధికారులు చేతులు ఎత్తేశారు. కౌన్సిల్ లో కౌన్సిల్ సభ్యులు దోమల నివారణ చేపట్టాలని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చినా పలితం లేకపోయింది. ఇటీవల కాలంలో వైసిపి లో గోకుల్ రెడ్డి, శిల్పా రవి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు విసిగిపోయి గోకుల్ రెడ్డి నీ కలిశారు. దోమల నివారణకు తన వంతు కృషిచేస్తానని మాట ఇచ్చారు. ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం దోమల నివారణకు సొంత నిధులతో యంత్రాలను తెప్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించి మిషన్లను వార్డుల్లో కి పంపించారు.
ఈ సందర్భంగా గోకుల్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఒక చరిత్ర కల్గిన మున్సిపాలిటీ. దోమల నివారణకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు అన్నారు. దోమల నుంచి ప్రజలను కాపాడేందుకు 10 పాగింగ్ యంత్రాలు,10 పిచికారి యంత్రాలు తీసుకొచ్చానని ఈ రోజు కొన్ని యంత్రాలు వార్డుల్లో వెళుతున్నాయి అన్నారు. అంచెలంచెలుగా నంద్యాల పట్టణంలోని 42 వార్డుల తో పాటు నంద్యాల మండలం, గొస్పాడు మండలాల్లో దోమల నివారణకు యంత్రాలు పంపిస్తానని అన్నారు. ప్రజల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని పేర్కొన్నారు. శెబాస్ గోకుల్ రెడ్డి అంటూ ప్రజలు హర్శిస్తున్నారు..
Comments