చెలరేగిపోతున్న రేషన్ బియ్యం దందా..
చెలరేగిపోతున్న రేషన్ బియ్యం దందా..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం దందా ఆరు మూటలు... మూడు బస్తాలుగా వెలుగొందుతుంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం దందా యదేచ్చగా కొనసాగుతుంది. మాఫియాను తలపించే విధంగా కొనసాగుతున్న బియ్యం దందా. పేదలకు చెందాల్సిన పౌరసరఫరాల బియ్యం నీ కొందరు దళారులు పక్కదారి పట్టిస్తున్నపట్టికి పరిపాలన ఏ మాత్రం పట్టింపూలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అక్రమ దందాలపై ఉక్కు పాదం మోపుతునట్ల్లు అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ పిడిఎస్.. . మాఫియా మాత్రం తగ్గేదెలా అంటూ సవాలు విసురుతున్నారు.ఆరు మూటలు మూడు బస్తాలుగా వెలుగొందుతుంది
బేరాలకు.... బేరాలు... వున్నాయా......?
ఆగని దందా......
అప్పుడప్పుడు టాస్క్ ఫౌర్స్ అదికారులు దాడులు నిర్వహించిన పీ డి ఎస్ దందాను మత్రం అరికట్టలేక పోతున్నారు. ఈ దందాకు పలువురు తన వంతు సహాయ సహకారాలు అందించడం తో పాటు మిల్లుల యాజమాన్యం తో ఉదాసీనత వైఖరి ప్రదర్శిస్తునట్ల్లు ఆరోపణలు వస్తున్నాయి, ఎవరు ఎన్ని చెప్పినా... ఏన్ని దాడులు చేసినా ఆగని అక్రమ వ్యాపారుల దందా.....
దర్జాగా దందా.....
మొక్కుబడిగా, నామ మాత్రంగా, తూతూ మంత్రంగా, దాడులు జరపడం వల్లన అక్రమ బియ్యం దందాకు అరికట్టు లేకపోతునారు ఆని పెద్ద ఎత్తున ఆరోపణలు. బియ్యం దందా పట్ట పగలు ప్రధాన రహదారుల వెంట జరుగుతున్న పట్టు కోవలసిన అధికారులే ఏం పట్టనట్టు వ్యవహరించడం పై బహిర్గతం గానే ఆరోపణలు వినిపిసతున్నాయి.
హామీలతో అక్రమ బియ్యం దందా.....
గ్రామ గ్రామనా టూ విల్లర్ ల పై తిరుగుతూ రేషన్ బియ్యం సరఫరా చేసే వ్యక్తులకు హామీలతో అక్రమ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. నువ్వూ నాకు బియ్యం తెచ్చేటపుడు ఎవరైనా, ఏ అధికారి అయినా పట్టుకుంటే నాకు ఫోను చేయి అంటూ అటు అధికారులకి అయినా సంబంధిత వ్యక్తులకు చూసుకున్నాం, చూసుకుంటాం అన్నీ విధాలుగా అంటూ నువ్వు ఎం భయపడకు అంటూ హామీలతో అక్రమ బియ్యం దందాలు పలు మండలాల్లో.....
బేరాలకు..... బేరాలు... వున్నాయా....
ఇలా పట్ట పగలే రేషన్ బియ్యం దందా జరుగుతున్న పట్టించుకోలేనీ స్థితిలో అధికారులు. తగ్గేదేలే అంటున్న అక్రమ వ్యాపారులు....పలు మండలాల్లో ఇదే కథ......
ఇలా అక్రమ బేరాలకు బేరాలు వున్నాయా... అంటూ ప్రజా సంఘాలు, ప్రజలు, పలువురు బేరాలకు బేరాలు వున్నాయా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
బీరవేళ్ళి అవినాష్
ఏంఎ, ఏంసీజే (జర్నలిజం)
జర్నలిస్ట్,