ట్రాఫిక్ నిబంధనలు పాటించండి...సురక్షితంగా గమ్యం చేరండి....
- ట్రాఫిక్ నిబంధనలు పాటించండి...సురక్షితంగా గమ్యం చేరండి....
- హెల్మెట్ ధరించండి..ప్రాణాలు కాపాడుకోండి..
- అతివేగం అత్యంత ప్రమాదకరం...- ఇన్స్పెక్టర్ S.ఇస్మాయిల్
నంద్యాల, ఫిబ్రవరి 03 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లా ఎస్పీ K. రఘువీర్ రెడ్డి ఆదేశాలమేరకు రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా నంద్యాల జిల్లా ట్రాఫిక్ పోలీస్ వారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం మోటర్ సైకిల్ పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలియజేయడం జరిగింది. మోటార్ సైకిల్ పై అతివేగంగా ప్రయాణించరాదని తద్వారా మీకు ప్రమాదం జరగడమే కాకుండా ఎదుటివారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కావున వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలియజేయడమైనది.
ఈ ర్యాలీని నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్ ఇస్మాయిల్, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ నాయక్ జండా ఊపి ప్రారంభించడం జరిగింది.
ఈ అవగాహన ర్యాలీ నంద్యాల ITC సెంటర్ నుండి ప్రారంభమై Y.జంక్షన్, మున్సిపల్ ఆఫీస్, సంజీవనగర్ గేట్, శ్రీనివాస్ సెంటర్ మీదుగా టేక్కే మార్కెట్ యార్డు వరకు ఈ ర్యాలీ కొనసాగడం జరిగింది. ఇందులో సుమారు వందమంది వరకు ఔత్సాహికులు నంద్యాల పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది.
ఈ ర్యాలీ నందు నంద్యాల పట్టణ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ నాయక్ తో పాటు నంద్యాల టౌన్ ఎస్ఐ లు, ట్రాఫిక్ ఎస్ఐ లు వారి సిబ్బంది, కొందరు డ్రైవింగ్ స్కూల్ యజమానులు వారి సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.