-Advertisement-

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సర్వం సిద్ధం...ఈ సారి మాల్‌ ప్రాక్టీస్‌కు చెక్‌

10th class public exam time table 2024? Tenth class exams syllabus?10th class exams in ap 2024?10th class public exam 2024? Tenth exams latest updates
Peoples Motivation

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సర్వం సిద్ధం...ఈ సారి మాల్‌ ప్రాక్టీస్‌కు చెక్‌

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,473 పరీక్షా సెంటర్లు సిద్ధం

క్యూఆర్‌ కోడ్‌'తో మాల్‌ ప్రాక్టీస్‌కు చెక్‌

AP లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వివరాలు 

‘క్యూఆర్‌ కోడ్‌'తో మాల్‌ ప్రాక్టీస్‌కు చెక్‌

ఈసారి పదో తరగతి పరీక్షల్లో మాల్‌ ప్రాక్ట్రీస్‌కు అవకాశం లేకుండా అధికారులు ప్రత్యేక టెక్నాలజీ రూపొందించారు. ప్రతి పేపర్‌కు, ప్రతి ప్రశ్నకు క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. దీంతో మాల్‌ ప్రా్క్టీస్‌ చేసినా, పేపర్‌ లీక్‌ అయినా వెంటనే ఏ జిల్లాలోని ఏ మండలానికి చెందిన ఎగ్జాం సెంటర్‌లో ఏ విద్యార్థికి కేటాయించిన పరీక్ష పేపర్‌ అనేది నిమిషాల్లో తెలిసిపోతుంది. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్లతోపాటు విద్యాశాఖ అధికారులు, నాన్‌-టీచింగ్‌ సిబ్బంది, పోలీసులు, చీఫ్‌ ఇన్విజిలేటర్లు.. ఎవ్వరికీ కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకువెళ్లకుండా నిషేధించారు. పరీక్షల అనంతరం మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 8 వరకు స్పాట్‌ వ్యాల్యూషన్‌ పూర్తి చేస్తారు. అలాగే గతంలో రీ కౌంటింగ్, రీ వ్యాల్యూషన్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఫలితాలు తెలుసుకునేందుకు సంబంధిత సబ్జెక్ట్ పేపర్‌ వారి చేతికి ఇచ్చేవారు. ఈ ఏడాది అలాంటి వారికి వెబ్‌ లింక్‌ పంపించనున్నారు. సదరు లింక్‌ను ఓపెన్‌ చేస్తే పేపర్‌ సాఫ్ట్‌ కాపీని స్క్రీన్‌పై చూసుకునేలా ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,473 పరీక్షా సెంటర్లు సిద్ధం

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,473 ఎగ్జాం సెంటర్లను సిద్ధం చేసినట్లు తెలిపింది.

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

పదో తరగతి ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తాయి. మిగతా రెండు రోజుల్లో ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలు ఉంటాయి. 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వీరిలో గత ఏడాది పదో తరగతి ఫెయిలై తిరిగి ప్రవేశం పొందినవారు 1,02,528 మంది వరకు ఉన్నారు. ఇక ఓరియంటల్‌ విద్యార్థులు 1,562 మంది ఉన్నారు. మొత్తం పదో తరగతి విద్యార్థుల్లో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఈ ఏడాది పబ్లిక్‌ పరీక్షలకు హాజరుకానున్నారు.

ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటలకు వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మరో 30 నిమిషాలు అంటే ఉదయం 10గంటల వరకు అనుమతించే అవకాశం ఉంది. 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, 682 సిట్టింగ్‌ స్వాడ్స్‌ను అధికారులు సిద్ధంచేశారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల వద్ద స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారులు సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమిస్తారు. 130కి పైగా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఇలా ఈ సారి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ముందస్తు ఏర్పాట్లు పకడ్భందీగా చేశారు. అలాగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే ద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను చూపించి పరీక్ష కేంద్రాలకు బస్సుల్లో ఉచితంగా వెళ్లి, రావొచ్చని తెలిపారు. ఈ సదుపాయం ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

Thumbnails png SSC Public Exams
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వివరాలు...

మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్

మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్

మార్చి 21 - థర్డ్ లాంగ్వేజ్

మార్చి 23 - గణితం

మార్చి 26 - ఫిజిక్స్

మార్చి 28 - బయాలజీ

మార్చి 30 - సోషల్ స్టడీస్

Comments

-Advertisement-